Begin typing your search above and press return to search.
సంక్రాంతి బరిలో బంగార్రాజు ?
By: Tupaki Desk | 30 May 2019 6:03 AM GMTఇంకా ఏడు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ వచ్చే సంక్రాంతి మీద అప్పుడే స్టార్ వార్ మొదలైపోయింది. ఏడాది మొత్తం మీద వసూళ్ళ వర్షం కురిపించే అత్యంత కీలకమైన సీజన్ గా భావించే ఈ పండగను వదులుకునేందుకు ఎవరూ రెడీగా లేరు. ఇప్పటికే కొన్ని ఖరారు చేసుకోగా మరొకొన్ని టార్గెట్ చేసుకుంటున్నాయి. మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మూవీ ముందుగా ఆ సమయాన్ని లాక్ చేసుకుంది. అక్టోబర్ 2న సైరా ఫిక్స్ కావడం దాదాపు అయిపోయింది కాబట్టి బన్నీ-త్రివిక్రమ్ కాంబో సినిమాను ఆ పండక్కే లైన్ లో పెట్టుకున్నారు.
ఎంతో సెంటిమెంట్ గా భావించే బాలయ్య తాను కెయస్ రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్న మూవీని కూడా ఆ రేస్ లోనే పెట్టబోతున్నాడు. వీటికి థియేటర్లు సర్దడమే డిస్ట్రిబ్యూటర్లు పెను సవాల్ గా ఉంటే ఇవి చాలవు అన్నట్టు రజినీకాంత్ దర్బార్ కమల్ హాసన్ ఇండియన్ 2 పొంగల్ నే డెడ్ లైన్ గా పెట్టుకున్నాయని చెన్నై సమాచారం
ఇంత రష్ మధ్య నాగార్జున బంగార్రాజు సైతం అదే టైంకి ప్లాన్ అవుతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా రూపొందే ఈ మూవీ స్క్రిప్ట్ ని దర్శకడు కళ్యాణ్ కృష్ణ ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడు. మధ్యలో మన్మధుడు 2 రాకపోయి ఉంటె అదే సెట్స్ పైకి వెళ్ళేదేమో. ఎలాగూ మన్మధుడు 2 ఆశించిన దాని కన్నా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. జూలైలో బంగార్రాజు మొదలుపెట్టినా ఈజీగా ఐదు నెలల్లో పూర్తి చేయొచ్చు.
సోగ్గాడే ఆడింది సంక్రాంతి పోటీలోనే కాబట్టి ఇది కూడా బరిలో దించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఇన్ని సినిమాలు క్యు కట్టాయి కాని ఇందులో అసలు షూటింగ్ ప్రారంభం కానివి మూడు ఉన్నాయి. ఫైనల్ గా ఏవి పందెంలో ఉంటాయి ఏవి తప్పుకుంటాయి అనేది పూర్తిగా తేలాలంటే ఇంకొంత టైం పట్టేలా ఉంది