Begin typing your search above and press return to search.

అన్ని లెక్కలు వేసుకున్న నాగ్.. తెలంగాణ వాళ్ల మీద వడ్డిస్తున్నారేం?

By:  Tupaki Desk   |   13 Jan 2022 2:30 PM GMT
అన్ని లెక్కలు వేసుకున్న నాగ్.. తెలంగాణ వాళ్ల మీద వడ్డిస్తున్నారేం?
X
మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. వ్యాపారం వద్దకు వచ్చేసరికి కింగ్ నాగార్జున చాలాపక్కాగా ఉంటారు. లెక్క విషయంలో ఆయన ఎంత అలెర్టుగా ఉంటారో బోలెడన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేస్తారు. ఎలాంటి మొహమాటాలకు తావివ్వకుండా.. వాణిజ్య అంశాల్లో క్లియర్ గా ఉండే నాగార్జునకు తగ్గట్లే.. సినీ అభిమానులు అంతే క్లియర్ గా ఉండాల్సిన అవసరం ఉంది. తన తాజా మూవీ విడుదల సందర్భంగా ఏపీలో టికెట్ల తగ్గింపు విషయం మీద ప్రశ్నించినప్పుడు.. జీవో గురించి మాట్లాడుకున్నామని.. అందుకు తగ్గట్లే లెక్కలు వేసుకున్నట్లు చెప్పటం తెలిసిందే.

మరి.. అన్ని లెక్కలు వేసుకున్న నాగార్జున ఏపీ వారి విషయంలో ఒకలా.. తెలంగాణ విషయంలో మరోలా ఎలా ఉంటారు? ఆయన తాజా మూవీ హైదరాబాద్ లోని ఒక మల్టీఫ్లెక్సులో రూ.200 ఉంటే.. విజయవాడలోని అదే మల్టీఫ్లెక్సులో రూ.150 మాత్రమే ఉంది. మరి.. ఈ యాభై రూపాయిల లెక్క తేడా ఎవరిది? తెలంగాణలో ఉంటున్నందుకు నాగ్ తన సినిమాకు సర్ ఛార్జ్ వేస్తారా? అన్నది ప్రశ్న.

లెక్కల విషయంలో ఆయన ఎంత కచ్ఛితంగా ఉంటారో.. ప్రేక్షకులు కూడా అంతే ఉంటారు కదా? ఒకవేళ ఉండకున్నా.. నాగార్జునను చూసైనా నేర్చుకోవాలి కదా? అభిమానంతో యాభై రూపాయిలు కాదు..ఐదు వందల రూపాయిలైనా ఖర్చు చేస్తారు ఎవరైనా. కానీ.. లెక్క విషయానికి వచ్చినప్పుడు అలానే ఉండాలి కదా? ఆ లెక్కన తన బంగార్రాజు మూవీ టికెట్ ను తెలంగాణలో రూ.200లకు ఎలా అమ్ముతారు? లెక్కలు వేసుకోకుండా దిగాం..ఇప్పుడు ఏపీలో అమలవుతున్న జీవో కారణంగా భారీ నష్టమని.. తెలంగాణ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే.. సర్లేమని.. సర్దుబాటు చేసుకోవచ్చు.

అందుకు భిన్నంగా లెక్కలు వేసుకున్న విషయం మీద నాగ్.. క్లియర్ గా ఉన్నప్పుడు..ఏపీ ప్రేక్షకులకు ఒక టికెట్ ధరకు.. తెలంగాణ ప్రేక్షకులకు ఇంకో టికెట్ ధరను డిసైడ్ చేయటం న్యాయం కాదు కదా? మరి.. ఈ అన్యాయాన్ని ప్రేక్షకులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇంకెందుకు.. లెక్కలు బాగా తెలిసిన నాగ్ కు అర్థమయ్యేలా ‘లెక్క’ చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రేక్షకులందరి మీదా ఉంది. కాదంటారా?