Begin typing your search above and press return to search.

ఆయన స్క్రీన్ ప్రజెన్స్... సుర్రు సుమ్మాయిపోద్ది

By:  Tupaki Desk   |   29 Aug 2016 10:26 AM IST
ఆయన స్క్రీన్ ప్రజెన్స్... సుర్రు సుమ్మాయిపోద్ది
X
ఒక హీరో ఏదోక జోనర్ లో రాటుదేలి వర్గం అభిమానులను సొంతంచేసుకుంటాడు. కానీ టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జున మాత్రం అందుకు భిన్నం. ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర పరిమాణాన్ని మార్చుకోగలిగే బలమున్న జలం లానే ఎటువంటి పాత్రనైనా అతికినట్టు సరిపోతాడనే భావన మనకి అందిస్తాడు.

నాగార్జున ది ఒక ఎరా.. అతను నవ్విస్తాడు - ఏడిపిస్తాడు - గిలిగింతలు పెట్టిస్తాడు - కన్నీరు కార్పిస్తాడు - మాస్ మసాలాలో మనల్ని ముంచేస్తాడు. భక్తి పారవశ్యంలో తెలుస్తాడు. ఇలా ఎంతటి పాత్రనైనా దాటి తోటి ట్రావెల్ చేసి మనకు మరపురాని జ్ఞాపకాన్ని అందజేస్తాడు.

శివతో చైన్ నే కాక అప్పటిదాకా నెలకొన్న రికార్డులను సైతం తెంచేసిన నాగ్ ఆ గీతాంజలిలో అద్భుత ప్రేమికుడిగా మనసు తడిమేస్తాడు. నిన్నే పెళ్ళాడతా - ఆవిడా మా ఆవిడే - హలో బ్రదర్ లో నాగ్ పండించిన కామెడీ అసమానం. తనలోని హీరోని కాక నటుడిని పరిచయం చేసిన సినిమాలలో అన్నమయ్య ఎప్పటికీ చిరస్మరణీయం. భక్తి పాత్రల కోసం పరితపించే వారికి భుక్తాన్న భోజనాన్ని అందజేస్తాడు. ఒకానొక కాలంలో ఫ్లాపుల తరువాత ఆచి తూచి అడుగులు వేస్తూ కొత్తదనానికి - కొత్త తరానికి బాటలు వేస్తూ వరుస విజయాలు సాధిస్తున్న కింగ్ నాగ్ కి తుపాకీ.కామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది..