Begin typing your search above and press return to search.
'వైల్డ్ డాగ్' కూ శర్వానంద్ మూవీ ఫలితమే!
By: Tupaki Desk | 8 April 2021 1:30 PM GMTనాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'వైల్డ్ డాగ్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అంటూ చూసిన వారు చాలా గొప్పగా చెప్పారు. రివ్యూలు కూడా ఇలాంటి సినిమాలు రావాలి జనాల్లో దేశ భక్తి పెంపొందాలి అంటూ రాసేశారు. సినిమా రివ్యూ రేటింగ్ లు పబ్లిక్ టాక్ లు ఇండస్ట్రీ వర్గాల్లో వచ్చిన టాక్ ఇవన్నీ చూస్తే సినిమా పర్వాలేదు బాగానే వసూళ్లు చేస్తుందని అంతా ఆశించారు. కాని అనూహ్యంగా వైల్డ్ డాగ్ సినిమా వసూళ్ల విషయంలో పూర్తిగా నిరాశ పర్చింది. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా కూడా వసూళ్ల విషయంలో మాత్రం ప్లాప్ సినిమా రేంజ్ లో వెనుకబడి పోయింది.
వైల్డ్ డాగ్ సినిమాను జనాలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా కూడా సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. అయినా కూడా జనాలు థియేటర్లకు వచ్చి చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమాలను జనాలు ఇప్పుడు థియేటర్లలో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మారిన పరిస్థితులు మరియు కరోనా కారణాల వల్ల కేవలం మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలను మాత్రమే చూడాలని జనాలు థియేటర్ల వద్దకు వస్తున్నారు. అంతే తప్ప ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను చూడాలని మాత్రం వారు కోరుకోవడం లేదు.
ఇటీవల వచ్చిన శర్వానంద్ శ్రీకారం సినిమా కూడా చాలా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. రివ్యూలు రేటింగ్ లు బాగా వచ్చాయి. సినీ ప్రముఖులు ఎంతో మంది శ్రీకారంను అభినందించారు. ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా కూడా జనాలు ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చూసేంత సమయం ఓపిక లేదంటూ శ్రీకారంను పక్కకు పెట్టేశారు. అలా శ్రీకారం సినిమా కూడా పాజిటివ్ టాక్ వచ్చినా నిరాశ పర్చింది. మొత్తంగా ఇప్పుడు ప్రేక్షకులు పక్కా కమర్షియల్ మూవీలను మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని శ్రీకారం మరియు వైల్డ్ డాగ్ ఫలితాలతో తేట తెల్లం అయ్యింది.