Begin typing your search above and press return to search.

రారండోయ్‌..పై నాగ్ క్లారిటీ

By:  Tupaki Desk   |   6 May 2017 4:48 PM GMT
రారండోయ్‌..పై నాగ్ క్లారిటీ
X
క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ‘సోగ్గాడే చిన్నినాయ‌నా గురించి అప్ప‌ట్లో ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపించాయి. ఈ సినిమాను క‌ళ్యాణ్ స‌రిగా డీల్ చేయ‌లేకపోతున్నాడ‌ని.. నాగ్ చాలా సిరీయ‌స్ అయ్యాడ‌ని.. వేరే ర‌చ‌యిత‌ల స‌హ‌కారంతో స్క్రిప్టు మార్పించాడ‌ని.. రీషూట్లు చేయించాడ‌ని.. ఇలా చాలా ప్ర‌చారం న‌డిచింది అప్ప‌ట్లో. ఐతే చివ‌రికి ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్నందుకుందో తెలిసిందే.

‘సోగ్గాడే..కు కొంత‌మేర రీషూట్లు జ‌రిగిన మాట వాస్త‌వ‌మే అయినా.. క‌ళ్యాణ్ పై త‌న‌కున్న న‌మ్మ‌కం నిజ‌మైంద‌ని అత‌డికి కితాబిచ్చాడు నాగ్. ఇప్పుడు క‌ళ్యాణ్ రెండో సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ విష‌యంలోనూ ఇలాంటి రూమ‌ర్లే వ‌చ్చాయి. దీనికీ రీషూట్ల‌ని.. నాగ్ సీరియ‌స్ అని ప్ర‌చారం జ‌రిగింది. దీని వ‌ల్ల సినిమా వాయిదా కూడా ప‌డింద‌ని.. ముందు అనుకున్న‌ట్లు ఈ నెల 19న విడుద‌ల కాద‌ని అన్నారు. ఐతే నాగ్ ఈ ప్ర‌చారాన్ని ఖండించాడు.

‘రారండోయ్..’ వాయిదా అంటూ ఓ జ‌ర్న‌లిస్టు పెట్టిన ట్వీట్ మీద స్పందిస్తూ.. ఇది అవాస్త‌వ‌మ‌ని.. ఏదైనా ఉంటే త‌న ద‌గ్గ‌ర క్లారిటీ తీసుకోమ‌ని నాగ్ అన్నాడు. మ‌రో పత్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను కూడా ఖండించాడు నాగ్. కాబ‌ట్టి ‘రారండోయ్..’ య‌ధావిధిగా ఈ నెల 19న విడుద‌ల‌వుతున్న‌ట్లే అన్న‌మాట‌. నాగ‌చైత‌న్య‌-ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ నుంచి టైటిల్ సాంగ్ ను శ‌నివార‌మే లాంచ్ చేశారు. దానికి మంచి స్పంద‌నే వ‌స్తోంది. త్వ‌ర‌లోనే ప్రి రిలీజ్ ఈవెంట్ చేసి.. సినిమాను 19న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు నిర్మాత నాగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/