Begin typing your search above and press return to search.

అలా అయితేనే వైఎస్ పాత్ర చేస్తా-నాగ్

By:  Tupaki Desk   |   4 Feb 2018 7:03 AM GMT
అలా అయితేనే వైఎస్ పాత్ర చేస్తా-నాగ్
X
దివంగత ముఖ్య మంత్రి - ప్రజా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను సినిమాగా తీయాలనే ప్రయత్నాలు ఎందరో చేసారు కాని అవేవి కార్యరూపం దాల్చలేకపోయాయి. ఆ మధ్య వినోద్ కుమార్ హీరోగా ఓ సినిమా తీసారు కాని పూర్తి జీవిత కథ కాదు. అది కనీసం విడుదలైన విషయం కూడా అందరికి తెలిసే లోపే వెళ్లిపోయింది.ఆనందో బ్రహ్మతో లాస్ట్ ఇయర్ డీసెంట్ హిట్ కొట్టిన దర్శకుడు మహి రాఘవ ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడని రెండు నెలల క్రితమే ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి అని ఒకసారి - కాదు కింగ్ నాగార్జున అని మరోసారి ఇలా వైఎస్ గా ఎవరు నటిస్తారు అనే దాని గురించి రకరకాల చర్చలు జరిగాయి. ఇంకా ఇది కొలిక్కి రాలేదు కాని నాగార్జునను ఒప్పించే ప్రయత్నం అయితే జరుగుతోందని వినికిడి.

నాగార్జున కూడా పాజిటివ్ గానే ఉన్నా ఒక మెలిక పెట్టాడని టాక్. 2019 ఎన్నికలు పూర్తైన తర్వాత విడుదల అయ్యేలా ఇది ప్లాన్ చేస్తే తాను చేయటం గురించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని అన్నట్టు సమాచారం. దీనికి కారణం ఒకటే. ఒకవేళ ఈ సినిమా త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తే అది నేరుగా ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వైఎస్ మీద తీసిన సినిమా కాబట్టి పార్టీ వర్గాలు ఎన్నికల కోసం ఉపయోగించుకుంటారు. అప్పుడు నాగార్జున నేరుగా ప్రచారం చేశాడే అనే ఫీలింగ్ పబ్లిక్ లో కలిగేందుకు అవకాశం ఉంది. అసలు రాజకీయల్లోక్లి వచ్చే ఉద్దేశం లేని తనకు ఇది ఇబ్బంది కలిగిస్తుందేమో అనే అనుమానంతోనే నాగార్జున ఈ కండీషన్ పెట్టినట్టు టాక్.

ఏది ఎలా ఉన్నా ఇప్పుడో లేక వచ్చే సంవత్సరమో ఈ బయోపిక్ తెరకెక్కడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. కాని పూర్తి జీవిత కథను కాకుండా పార్టీలో చేరిన రోజు మొదలుకొని ముఖ్య మంత్రి పీఠం అధిష్టించి ప్రజా సంక్షేమ పధకాలు తీసుకొచ్చి జననేతగా గుర్తింపబడటం దాకా ఉంటుందట. మరి నాగ్ చేస్తే బాగుంటుంది కాని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దాకా దీని గురించి ఇప్పుడే కంక్లూజన్ కు రాలేం