Begin typing your search above and press return to search.

నాగ్ కూడా ఇలా మాట్లాడితే ఎలా..?

By:  Tupaki Desk   |   9 Feb 2017 7:18 AM GMT
నాగ్ కూడా ఇలా మాట్లాడితే ఎలా..?
X
అక్కినేని నాగార్జున అతిశయోక్తులు లేకుండా చాలా క్యాజువల్ గా మాట్లాడుతుంటాడు. చాలామంది హీరోలతో పోలిస్తే నాగ్ మాట కొంచెం స్వచ్ఛంగా ఉంటుంది. ప్రి రిలీజ్ ప్రమోషన్లలో తన సినిమాల గురించి నాగార్జున అతిగా చెప్పుకోవడం తక్కువ. ఐతే ఆయన కూడా అప్పుడప్పుడు శ్రుతి మించి మాట్లాడేస్తుంటాడు. భారీ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. గతంలో ‘రగడ’ అనే రిలీజవుతుంటే.. ఇది నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పకున్నాడు నాగ్. అలాంటి మామూలు సినిమా గురించి నాగ్ అలా చెప్పాడేంటి అని అంతా అనుకున్నారు. ఇప్పుడు ‘ఓం నమో వెంకటేశాయ’ విషయంలో నాగ్ చెబుతున్న మాటలు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

ఇన్నేళ్ల తన కెరీర్లో ‘ఓం నమో వెంకటేశాయ’నే బెస్ట్ ఫిల్మ్ అని నాగ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. శివ.. గీతాంజలి.. అన్నమయ్య.. మనం లాంటి సినిమాల్ని పెట్టుకుని నాగ్ ‘ఓం నమో వెంకటేశాయ’కు అగ్ర పీఠం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇది ఆధ్యాత్మిక చిత్రం కాబట్టి దానికి ఆ గౌరవం ఇచ్చాడేమో అనుకుందాం అంటే.. అలాంటపుడు ‘అన్నమయ్య’ కంటే ‘ఓం నమో వెంకటేశాయ’ గొప్ప సినిమానా అనేది సందేహం. ఈ ‘బెస్ట్’ అనే మాట సంగతి పక్కనబెడితే.. ‘ఓం నమో వెంకటేశాయ’ విడుదలకు ముందు ఉన్నంత టెన్షన్ ఫ్రీగా ఇంతకుముందు ఏ సినిమాకూ లేదంటున్నాడు నాగ్. మామూలుగా అయితే.. ఒక సినిమా విడుదలకు ముందు దాని బిజినెస్ గురించి.. రిజల్ట్ గురించి.. కలెక్షన్ల గురించి ఆలోచిస్తామని.. ఐతే ‘ఓం నమో వెంకటేశాయ’ విషయంలో మాత్రం అలాంటి టెన్షనే లేకుండా ప్రశాంతంగా ఉన్నానని.. ఇలా ఇంతకుముందు ఏ సినిమాకూ జరగలేదని నాగ్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/