Begin typing your search above and press return to search.

నేను ఇంత పెద్ద స్టార్ అయ్యానంటే కొత్త ద‌ర్శ‌కుల వ‌ల్ల‌నే! -నాగార్జున‌

By:  Tupaki Desk   |   31 March 2021 10:33 AM GMT
నేను ఇంత పెద్ద స్టార్ అయ్యానంటే కొత్త ద‌ర్శ‌కుల వ‌ల్ల‌నే! -నాగార్జున‌
X
కింగ్ నాగార్జున న‌టించిన `వైల్డ్ డాగ్` ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.ఆషిసోర్ సోల‌మ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. స‌యామీఖేర్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. తాజాగా కింగ్ నాగార్జున ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా చాట్ లో ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వెల్ల‌డించారు. ముఖ్య‌మైన విష‌యాలివీ..

*మునుప‌టితో పోలిస్తే ఈ సినిమాకి ప్ర‌చారం ఎక్కువే చేస్తున్నాం. అలా ఎందుకు అంటే.. ఇలాంటి సినిమాకి ప్రచారం చాలా అవ‌స‌రం. ఇది న్యూ ఏజ్ సినిమా. క‌థాంశం యూనిక్ గా ఎగ్జ‌యిటింగ్ గా ఉంటుంది. తీవ్ర‌వాదం నేప‌థ్యం .. ఎన్.ఐ.ఏ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మిది. స్క్రీన్ ప్లే ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది..

*కెరీర్ లో 48 మంది కొత్త ద‌ర్శ‌కుల్ని ప‌రిచ‌యం చేయ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచేదే. కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేస్తే కొత్త‌గా ఉంటుంది. నాకు కొత్త‌గా ఉంటుంది. కొ‌త్త‌గా చేయ‌క‌పోతే నాకే బోర్ కొడుతుంది. అవే డ్రెస్ లు అవే క‌థ‌ల‌తో రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌లేను. కొత్త‌వారిని ప‌రిచ‌యం చేస్తే దెబ్బ‌లు తింటాం. కానీ స‌క్స‌స్ వ‌స్తుంది. నేను ఇంత పెద్ద స్టార్ అయ్యానంటే కొత్త ద‌ర్శ‌కుల వ‌ల్ల‌నే!

* 2019 జూలై ఆగ‌స్టులో వైల్డ్ డాగ్ క‌థ విని ఓకే చేశాను. బంగార్రాజుకి రెడీ అవుతున్న‌ టైమ్ లో ఈ స్కిప్టు వ‌చ్చింది. రెండు స్క్రిప్టులకు ప‌నులు జ‌రుగుతున్నాయి. చాలా ఫాస్ట్ ఫిలిం.. త్వ‌ర‌గా అయిపోతుంది. 60-70 రోజుల్లో అయిపోతుంద‌ని వైల్డ్ డాగ్ మొద‌లు పెట్టాం. డిసెంబ‌ర్ 2019 షూట్ మొద‌లు పెట్టి .. ఫిబ్ర‌వ‌రి మార్చి వ‌ర‌కూ షూటింగ్ చేశాం. ఆ త‌ర్వాత‌ థాయ్ ల్యాండ్ వెళ్లాలి. కానీ అక్క‌డ‌ మూసేశారు.. త‌ర్వాత లాక్ డౌన్ వ‌ల్ల 50శాతం పెండింగ్ షూట్ అలా ఉండిపోయింది. లాక్ డౌన్ తొల‌గించి షూటింగుల‌కు అనుమ‌తించాక పూర్తి చేశాం.

*ఇది నా కెరీర్ లో చెప్పుకునే స్పెష‌ల్ రోల్ అవుతుంది. అలాగే యాక్ష‌న్ డిఫ‌రెంటుగా ఉంటుంది. అటు క‌మ‌ర్షియ‌ల్ .. ఇటు క‌ల్ట్ కి క‌న్విన్సింగ్ గా ఉండేలా ఫైట్స్ కొత్త త‌ర‌హాగా పుట్టుకొచ్చాయి. అవి అంద‌రికీ న‌చ్చుతాయి.

*ఫ్యామిలీ ఆడియెన్ వ‌స్తారా అంటే... శివ స‌మ‌యంలో కూడా ఇదే డౌట్ వ్య‌క్త‌మైంది. వ‌యోలెన్స్ ఎక్కువ‌ ఉంది. ఆడాళ్లు థియేట‌ర్ల‌కు రారేమో అనుకున్నాం. కానీ వ‌చ్చారు. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియెన్ వ‌స్తారన్న న‌మ్మ‌కం ఉంది.

*విజ‌య్ వ‌ర్మ ఒక మంచి తండ్రి అధికారి మంచి టీమ్ లీడ‌ర్. అత‌ను అనుకున్న‌ది సాధిస్తాడు. దేశం అంటే ప్రాణం.. ఎన్.ఐ.ఏ ద్వారా తీవ్ర‌వాదుల్ని ప‌ట్టుకునే అధికారి. తీవ్ర‌వాదంతో మ‌న దేశాన్ని నాశ‌నం చేయాల‌నుకునే వారిని టార్గెట్ చేసేదే ఎన్.ఐఏ. ఈ సినిమాలో ఎవ‌రినీ విజ‌య్ వ‌ర్మ‌ అరెస్ట్ చేయ‌డు. వాళ్ల‌ను అప్ప‌టిక‌ప్పుడు చంపేయ‌డమే ఈ పాత్ర స్వ‌భావం. ఇంత ప‌వ‌ర్ ఫుల్ వ‌యోలెంట్ పాత్ర‌లో క‌నిపిస్తాను. అయితే ప్ర‌తిసారీ టెర్ర‌రిజం ఆప‌రేష‌న్ కి వెళ్లాక వ‌స్తానో రానో అని భార్య‌ను అనుమ‌తి అడిగే పాత్ర ఇది. స్నేహం కోసం ప్రాణ‌మిచ్చే పాత్ర కూడా. ఇది నాకు వ్య‌క్తిగ‌తంగా న‌చ్చుతుంది. దేశం గొప్ప‌త‌నాన్ని తెలిపే పాత్ర ఇది. విదేశాల్లోనూ తీవ్ర‌వాదుల్ని వేటాడి దేశం గ‌ర్వించేలా చేసే పాత్ర లో ఆద్యంతం మెప్పిస్తాను.

* ఈ సినిమాతో పాటు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాను. ఒక షెడ్యూల్ పూర్త‌య్యాక ఇలా ప్ర‌మోష‌న్స్ కి వ‌చ్చాను.. అని నాగార్జున తెలిపారు.