Begin typing your search above and press return to search.

నాగార్జున పని పట్టబోతున్న ఆంధ్రా బ్యాంక్

By:  Tupaki Desk   |   23 Dec 2015 8:53 AM GMT
నాగార్జున పని పట్టబోతున్న ఆంధ్రా బ్యాంక్
X
ఓ బక్క రైతు 50 వేల రూపాయల లోన్ తీర్చకపోతే ముక్కు పిండి అయినా మొత్తం వసూలు చేస్తారు బ్యాంక్ అధికారులు. కానీ బడా బాబు వందల కోట్లు ఎగ్గొట్టినా ఏం చేయలేరు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు తన కంపెనీ తరఫున వెయ్యి కోట్లు ఎగ్గొడితే వెళ్లి ఆయన ఇంటి ముందు ఓ బ్యాంకు సిబ్బంది మౌన ప్రదర్శన చేశారు తప్ప ఇంకే చేయలేకపోయారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బడా బాబులందరూ కలిసి బ్యాంకులకు ఎగ్గొట్టిన మొత్తం 8 లక్షల కోట్ల రూపాయల దాకా ఉన్నాయని ఓ అంచనా. ఈ మొండి బకాయిల్ని రాబట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కూడా బ్యాంకులకు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న టైంలో ఆంధ్రా బ్యాంకు అధికారులు హీరో అక్కినేని నాగార్జున విషయంలో కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు.

నాగ్ ఆధ్వర్యంలో నడిచే అన్నపూర్ణ స్టూడియోస్.. ఆంధ్రా బ్యాంకుకి రూ.37 కోట్ల రూపాయలు బకాయిలు పడిందట. ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నా నాగ్ అండ్ కో స్పందించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. వెంటనే రూ.37 కోట్ల అప్పును క్లియర్ చేయాలని నోటీస్ లో పేర్కొనడమే కాదు.. అన్నపూర్ణ స్టూడియోపై కేసు కూడా నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు. నాగార్జునతో పాటు ఆయన మేనకోడలు సుప్రియ, అన్నయ్య వెంకట్ అక్కినేని, అక్క నాగసుశీల, నిమ్మగడ్డ ప్రసాద్ లకు కూడా ఆంధ్రా బ్యాంకు నోటీసులు జారీ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ మరికొన్ని బ్యాంకుల దగ్గర కూడా అప్పులు చేసిందని.. మొత్తంగా రూ.100 కోట్ల దాకా మొండి బకాయిలు ఉన్నాయని ఆంధ్రా బ్యాంకు అధికారులు అంటున్నారు. ఈ స్టూడియో పని పట్టడానికి ప్రత్యేక అనుమతలు కోసం ఆర్బీఐకి కూడా విజ్నప్తి చేసింది ఆంధ్రా బ్యాంకు. కాబట్టి నాగార్జున అండ్ కోకు మున్ముందు ఇబ్బందులు తప్పేలా లేవు.