Begin typing your search above and press return to search.

నాగార్జున గారు.. మాకెందుకీ శిక్ష?

By:  Tupaki Desk   |   21 Jan 2023 2:30 AM GMT
నాగార్జున గారు.. మాకెందుకీ శిక్ష?
X
ఒకప్పుడు టాలీవుడ్లో నలుగురు హీరోల మధ్య విపరీతమైన పోటీ నెలకొని ఉండేది. నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్. ఈ నలుగురు టాలీవుడ్లో ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో సందడి చేస్తూ ఉండేవారు. వీరి మధ్య చాలా స్నేహపూర్వక పోటీ నెలకొని ఉండేది. అభిమానులు ఎంత కొట్టుకున్నా... తిట్టుకున్నా... హీరోలు మాత్రం చాలా స్నేహంగా మెలుగుతూ ఉండేవారు.

అయితే ఇప్పుడు నాగార్జున అభిమానులు మాత్రం తమ బాధ బయటకు చెప్పుకోలేక లోపలే బాధపడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే నాగార్జున సోలో హిట్ కొట్టి... చాలా కాలమే అయింది.

దాదాపు ఆరేడేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాతో హిట్ అందుకున్న నాగార్జున.. ఆ తర్వాత హిట్ ఎలా ఉంటుందో మర్చిపోయారా అన్నట్లుగా దాదాపుగా అన్ని సినిమాలు యావరేజ్ డిజాస్టర్గా నిలుస్తూ వచ్చాయి. అయినా సరే ఆయన అభిమానులు మాత్రం ఎక్కడా తగ్గకుండా ఆయన ఎప్పటికైనా హిట్ సినిమా చేస్తాడు... మా అందరి ఆశలు తీరుస్తాడు అని ఎదురుచూస్తున్నారు
.
అయితే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి సినిమాలతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఇద్దరు సీనియర్ హీరోలతో పోల్చుకుంటూ... ఇప్పుడు నాగార్జున అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంధ్యా, సుదర్శన్ వంటి ఆర్టీసీకి క్రాస్ రోడ్స్ థియేటర్లలో ఒకవేళ మీ సినిమా విడుదల అయితే మొదటి రోజు ఇతర హీరోల అభిమానులకు ఏమాత్రం తగ్గకుండా మేము సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఒక రేంజ్లో మీ ఫ్యాన్స్గా కాలర్ ఎగరేసుకుందాం అని ప్రయత్నిస్తున్నాం. కానీ మీరు మాత్రం మేము సెలబ్రేషన్స్ పెట్టిన ఖర్చు కూడా ఆ థియేటర్లలో రాబట్ట లేకపోతున్నారు ఎందుకు.

ఆ స్క్రిప్ట్ సెలక్షన్స్ మీద దృష్టి పెట్టడం లేదు. ఇతర హీరోలు, సీనియర్ హీరోలు.. స్క్రిప్ట్ సెలెక్షన్స్ మీద దృష్టి పెట్టి ఏదో ఒక విధంగా కనీసం తమ అభిమానులనైనా అలరిస్తూ వస్తున్నారు. కానీ మీరు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లు అందరూ 100 కోట్ల సినిమాలు తమ ఖాతాల్లో వేసుకున్నారు, కానీనాగార్జున మాత్రం ఒక్క సినిమా కూడా వేసుకోలేదు. ఇంకెప్పటికీ నాగార్జున వంద కోట్ల సినిమా తన లిస్టులో యాడ్ చేసుకుంటాడంటూ.. వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.