Begin typing your search above and press return to search.

నాయనా వర్మా!! ఇది చూశావా?

By:  Tupaki Desk   |   5 Jun 2018 10:28 AM GMT
నాయనా వర్మా!! ఇది చూశావా?
X
నాగార్జున కెరీర్ లో మరచిపోలేని డిజాస్టర్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో చాలా వరకు కొంత నచ్చుతాయి. కానీ నాగ్ కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ 20 ఏళ్ల తరువాత ఆఫీసర్ ద్వారా మరచిపోలేని డిజాస్టర్ ఇచ్చాడు. ఆ సినిమా ఏ విధంగా కూడా నాగ్ కు ఉపయోగపడలేదు. సినిమా కొంచెం కూడా హిట్ అవ్వలేదు. దాదాపు అన్ని ఏరియాల నుంచి కలెక్షన్స్ వీక్ గా ఉన్నాయనే టాక్ వచ్చింది

స్వయంగా సహా నిర్మాతే ఆ విషయాన్ని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అభిమానులు అయితే ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఎంతో ప్రగల్బాలు పలికిన వర్మ దెబ్బేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే వర్మ దర్శకత్వ ప్రతిభకు రీసెంట్ గా అక్కినేని అభిమానులు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. ఓ విధంగా ప్రాధేయపడ్డారనే చెప్పాలి.

ఇక నాగ్ కు ఇచ్చిన డిజాస్టర్ చాలని వర్మ కౌటౌట్ కి పాలాభిషేకం చేశారు. ఇక చాలు ఇంతటితో వదిలెయ్యి అని చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది మరి వర్మ వరకు ఆ ఫొటో వెళ్లిందో లేదో..