Begin typing your search above and press return to search.
తండ్రిగా గర్వం.. కొడుకుగా అసూయ
By: Tupaki Desk | 11 May 2018 4:53 AM GMTతెలుగు ప్రేక్షకులు ఏనాటికీ మరిచిపోలేని గొప్ప నటి సావిత్రి. ఆమె జీవితగాథను తెరకెక్కిస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన మహానటి సినిమా బాక్సాఫీసును విపరీతంగా ఆకట్టుకుంది. నాటితరం నటీనటులు.. దర్శకులు.. ప్రముఖుల పాత్రలను నేటితరం నటులతో చేయించి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా చూశాక హీరో నాగార్జున రీసెంట్ గా ట్విట్టర్ లో ఓ ఇంట్రస్టింగ్ పోస్టు పెట్టాడు.
మహానటి సినిమాలో హీరో నాగ చైతన్య తన తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్ర చేశాడు. ఇది చిన్న పాత్రే అయినా నాగచైతన్య రోల్ అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంది. తనకు రాని ఛాన్స్ తన కొడుకు దక్కిందంటూ నాగార్జున తన పుత్రోత్సాహాన్ని పంచుకున్నాడు. ‘‘ఈరోజు నేను తండ్రిగా గర్వపడుతున్నా.. ఓ కొడుకుగా మాత్రం అసూయ పడుతున్నా. నేను ఇప్పటివరకూ నా తండ్రి లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించలేదు. కానీ ఈ రోజు నా కొడుకు నాగ చైతన్య ఏఎన్నార్ లా నటించినందుకు చాలా ఆనంద పడుతున్నా’’ అంటూ నాగ్ తన ఫీలింగ్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు.
మహానటిలో నాగార్జున కోడలు సమంత ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఈ పాత్ర కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొడుకు - కోడలు ఒకే సినిమాలో నటించడం.. వాళ్ల పాత్రలకు గుర్తింపు రావడం అంటే నాగార్జునకు ఓ రకంగా డబుల్ హ్యాపీ అనే చెప్పొచ్చు.