Begin typing your search above and press return to search.

నాగ్ మొదటి పెళ్లి ఫొటో.. చైతూలానే ఉన్నాడే!

By:  Tupaki Desk   |   12 Oct 2022 12:30 PM GMT
నాగ్ మొదటి పెళ్లి ఫొటో.. చైతూలానే ఉన్నాడే!
X
అక్కినేని నాగార్జున నవ మన్మధుడిగా ఇప్పటికీ కూడా ఒకే తరహా క్రేజ్ తో కొనసాగుతున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అతను ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును అయితే అందుకున్నాడు. నాగార్జునపై అప్పట్లో అయితే లవర్ బాయ్ తరహాలో చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చాలా కూల్ గానే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

రూమర్స్ కు అయితే పెద్దగా తావువ్వడం లేదు. కానీ ఆయన అప్పుడప్పుడు సినిమాల్లో చేసే క్యారెక్టర్స్ మాత్రం మన్మధుడు ట్యాగ్ ను అందిస్తూ ఉంటాయి. ఇక నాగర్జున సంబంధించిన ఒక వింటేజ్ ఫోటో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నాగార్జున మొదటి పెళ్లి ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ చైతు ని చూసినట్లే ఉంది అని కామెంట్ చేస్తున్నారు.

నాగార్జున మొదట దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మీ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత వారు ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నారు. అప్పటికే నాగచైతన్య జన్మించాడు.

ఆ తర్వాత మరి కొన్నాళ్లకు నాగార్జున శివ సినిమా ద్వారా అమలతో పరిచయమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక అమలను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా నాగచైతన్య ఎక్కువగా నాగార్జునతోనే ఉన్నాడు.

ఇక చైతూ సమంత పెళ్లి అయినప్పుడు కూడా అమలతోపాటు నాగార్జున మాజీ భార్య లక్ష్మీ దగ్గుపాటి కూడా వేడుకలో హైలెట్ గా కనిపించారు. ఆమె కూడా మరో పెళ్లి చేసుకుని తన పర్సనల్ లైఫ్ తో బిజీగా మారిపోయారు.

ఇక నాగచైతన్య అయితే ఒకవైపు దగ్గుపాటి మనవడిగాను మరొకవైపు అక్కినేని వారసుడి గాను చాలా బాధ్యతతో సమానంగా కొనసాగుతూ ఉన్నాడు. కేవలం నాగార్జున మాత్రమే కాకుండా దగ్గుపాటి సురేష్ బాబు కూడా తన మేనల్లుడితో అప్పుడప్పుడు సినిమాలను చేస్తున్నాడు. ఇక వెంకీ మామ కూడా మేనల్లుడికి ఎంతో సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.