Begin typing your search above and press return to search.

హలో.. అంత గ్రాఫిక్స్ వద్దమ్మా!!

By:  Tupaki Desk   |   5 Oct 2017 2:30 AM GMT
హలో.. అంత గ్రాఫిక్స్ వద్దమ్మా!!
X
ప్రస్తుత రోజుల్లో గ్రాఫిక్స్ ని వాడితే సినిమాకి తగ్గట్టుగా ఉండాలి. ఎదో స్పెషల్ ఎఫెక్ట్ కోసం చేస్తే సినిమా ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చదు. కేవలం కథ డిమాండ్ చేస్తేనే గ్రాఫిక్స్ ని వాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడిపుడే పూర్తిగా అటువైపు అడుగులు వేస్తున్న టాలీవుడ్ విజువల్ వండర్స్ ని అందించే ప్రయత్నాలు చేస్తోంది. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో ప్రస్తుతం సైరా సినిమా కూడా విజువల్ వండర్ గా తెరకెక్కనుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం కింగ్ నాగార్జున కూడా రాజుగారి గది -2 సినిమా గ్రాఫిక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. గ్రాఫిక్స్ విషయంలో అవుట్ ఫుట్ చాలా క్లియ్యర్ గా ఉండాలని నాగార్జున ఇదివరకే చిత్ర యూనిట్ కి తెలిపాడు. కానీ ఆ సినిమా గ్రాఫిక్స్ విషయంలో నాగ్ కాస్త నిరాశగా కనిపిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకో గ్రాఫిక్స్ పరమైన సినిమాలు అక్కినేని ఫ్యామిలీకి కలిసిరావడం లేదు. ఇంతకుముందు డమరుకం సినిమాలో గ్రాఫిక్స్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇక అఖిల్ మొదటి సినిమా అఖిల్ లో కూడా కొన్ని విజువల్ ఎఫెక్ట్ సీన్స్ చాలా దారుణంగా కనిపించడంతో నాగ్ చాలా నిరాశ చెందారు. ఇప్పుడు రాజుగారి గది 2 గ్రాఫిక్స్ విషయంలో కూడా నాగ్ కాస్త డౌట్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే అఖిల్ రెండవ సినిమా "హలో" విషయంలో అలాంటి లోపాలు జరగకుండా నాగ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కొన్ని యాక్షన్ సీన్స్ కి విజువల్స్ వాడాల్సిన అవసరం ఉన్నా నాగ్ మరి ఎక్కువగా అవసరం లేదని హాలీవుడ్ టెక్నీషన్స్ ని పిలిపించి రియల్ యాక్షన్ సీక్వెన్స్ ని చేయిస్తున్నారట. కొన్ని ఛేజ్ సీన్స్ ఈ సినిమాలో హైలెట్ కానున్నాయని తెలుస్తోంది. అయితే ఆ సీన్స్ లో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ని ఎక్కువగా వాడబోవట్లేదట. మొత్తానికి గ్రాఫిక్స్ దెబ్బని నాగ్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లున్నారు.