Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన నాగార్జున
By: Tupaki Desk | 17 Feb 2022 10:30 AM GMTస్టార్ హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బర్త్ డే రోజు సర్ ప్రైజ్ ఇచ్చారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షో లో గెస్ట్ గా పాల్గొన్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని అబినందించిన ఆయన అదే వేదిక సాక్షిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తను కూడా అడవులని దత్తత తీసుకుంటానని మాటిచ్చారు. ఇచ్చిన మాటని సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిలబెట్టుకుని వార్తల్లో నిలిచారు.
తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ గత కొంత కాలంగా పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కింగ్ నాగార్జున కూడా తన వంతు బాద్యతగా 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. హైదరాబాద్ శివారులోని చెంగిచెర్ల అటవీ బ్లాక్ పరిధీలో వున్న 1080 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దివంగత తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద దత్తత తీసుకున్న నాగార్జున ఆ ప్రాంతాన్ని అర్బన్ ఫారెస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నారు.
గురువారం చెంగిచెర్ల ప్రాంతంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో పాటు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యలుతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగచైతన్య, సుశాంత్, సుమంత్, అఖిల్ , అమల, అక్కినేని వెంకట్, నాగ సుశీల తదితరులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ పార్కు అభివృద్ధికి ముఖ్య మంత్రి సంకల్పించిన హరిత నిధికి గానూ నాగార్జున రెండు కోట్ల రూపాయల చెక్ ను అటవీ అధికారులకు అందజేశారు.
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ - మేడిపల్లి ప్రాంతంలో చెంగిచెర్ల ఫారెస్ట్ బ్లాక్ వుంది. చుట్టూ అభివృద్ధి పేరుతో పెరిగిన జనావాసాల మధ్య 1682 ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి వుంది. ఈ ఫారెస్ట్ లోంచి నాగార్జున 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత ఈసుకున్నారు. నగర వాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేలా కొద్ది ప్రాంతంలో అర్బన్ పార్కుని అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతంలో అటవీ పునరుద్దరణ పనులు చుయనున్నారు. మేడిపల్లి నుంచి చెంగిచెర్ల - చర్లపల్లి - ఈసీఐఎల్ ప్రాంతాలు.. కాలనీ వాసులకు ఈ పార్కు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.
మన పరిసరాలు, మన రాష్ట్రం .. దేశం కూడా ఆకుపచ్చగా పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో తెలంగాణకు హరితహారం స్ఫూర్తిగా ఎంపి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో తాను పాల్గొని పలు సందర్భాల్లో మొక్కలు నాటానని నాగార్జున తెలిపారు.
అంతే కాకుండా గతంలో బిగ్‌బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అడివి దత్తతపై సంతోష్ గారితో చర్చించానని, ఆ రోజు వేదికపై ప్రకటించినట్టుగానే ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ పారెస్ట్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా వుందని తెలిపారు నాగార్జున. గతంలో స్టార్ హీరో ప్రభాస్ కూడా అడవులని దత్తత తీసుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.