Begin typing your search above and press return to search.

నాగార్జున‌కి బంప‌రాఫ‌ర్ త‌గిలినట్టేనా?

By:  Tupaki Desk   |   1 Jan 2022 10:46 AM GMT
నాగార్జున‌కి బంప‌రాఫ‌ర్ త‌గిలినట్టేనా?
X
రెండు పిల్లులు.. ఒక కోతి.. రొట్టెముక్క క‌థ గుర్తుందా? ఎప్పుడ‌తో చిన్న‌త‌నంలో చ‌దువుకున్న క‌థ ఇది. ఈ క‌థ ఇప్ప‌డు ఎందుకు చెబుతున్నానంటే బాక్సాఫీస్ వ‌ద్ద కూడా కోతీ, పిల్లుల త‌ర‌హాలోనే ఫైట్ న‌డుస్తోంది. రెండు పిల్లులు రొట్టె కోసం కొట్టుకుంటుంటే మ‌ధ్య లో కోతి వ‌చ్చి తెలివిగా రొట్టెముక్క‌ని ఎత్తుకెళ్ల‌డం తెలిసిందే. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో రెండు భారీ చిత్రాల మ‌ధ్య మ‌రో సినిమా ఎందుకని పోటీలో వున్న సినిమాల‌ని త‌ప్పిస్తున్న వేళ `బంగార్రాజు`కి బంప‌రాఫ‌ర్ త‌గ‌ల‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే... ఈ సంక్రాంతికి రాజ‌మౌళి అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ఆర్ ఆర్ ఆర్‌` జ‌న‌వ‌రి 7న రిలీజ్ కు రెడీ అయిపోయింది. 14న పాన్ ఇండియా లెవెల్లో ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్` విడుద‌ల కాబోతోంది. మ‌ధ్య‌లో జ‌న‌వ‌రి 12న వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `భీమ్లా నాయ‌క్‌` రిలీజ్ అవుతుంద‌ని డేట్ ని కూడా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఇక్క‌డే ఓ చిక్కొచ్చి ప‌డింది. రెండు పాన్ ఇండియా చిత్రాల మ‌ధ్య `భీమ్లా నాయ‌క్‌` పోటీలో వుండ‌టం అవ‌స‌ర‌మా? అని `ఆర్ ఆర్ ఆర్‌` ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్ణ‌యించుకుని `భీమ్లా నాయ‌క్‌`ని రిలీజ్ వాయిదా వేయ‌మ‌న్నారు.

ఇందుకు నిర్మాత‌లు అంగీక‌రించ‌లేదు. దాంతో బాల్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోర్టులోకి వెళ్లింది. త్రివిక్ర‌మ్ మంత్రాంగంతో ప‌వ‌న్ స‌రే అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. దీంతో సంక్రాంతి రేసు నుంచి `భీమ్లా నాయ‌క్‌` ని త‌ప్పించేశారు. అంతే ఓకే `ఆర్ ఆర్ ఆర్‌` మ‌రో ఆరు రోజుల్లో రిలీజ్ అన‌గా ప‌రిస్థితులు మారిపోయాయి. ఒమిక్రాన్ , క‌రోనా ముకుమ్మ‌డిగా దేశంపై దాడి చేయ‌డం మొద‌లైంది. దీంతో అప్న‌మ‌త్త‌మైన `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ త‌మ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామంటూ ప్ర‌క‌టించింది.

ఇలా సంక్రాంతి బ‌రిలో నిలిచిన `భీమ్లా నాయ‌క్‌`ని `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ త‌ప్పిస్తే `ఆర్ ఆర్ ఆర్‌` ని మారుతున్న ప‌రిస్థితులు త‌ప్పించాయి. ఇక మిగిలింది `రాధేశ్యామ్‌`. ఈ నేఫ‌థ్యంలో `బంగార్రాజు` మే ఐ క‌మిన్ అంటూ స‌రాస‌రి త‌ను అనుకున్న డేట్ నే వ‌చ్చేస్తున్నానంటూ న్యూ ఇయ‌ర్ రోజున ప్ర‌క‌టిస్తూ టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రొట్టె కోసం పిల్లులు కొట్టుకుంటుంటే కోతి వ‌చ్చి ఎగేసుకుపోయిన‌ట్టుగా `ఆర్ ఆర్ ఆర్‌`, భీమ్లా నాయ‌క్ రిలీజ్ కోసం పోటీపడుతుంటే `బంగార్రాజు` సైలెంట్ గా రిలీజ్ ప్ర‌క‌టించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

కింగ్ నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా వుంది. అయితే థియేట‌ర్ల భారీ స్థాయిలో ల‌భించ‌క పోవ‌డంతో గ‌త కొన్ని రోజుల నుంచి లాభీయింగ్ మొద‌లుపెట్టిన నాగార్జున‌న బ‌య్య‌ర్స్ మొత్తానికి సంక్రాంతి రేస్ నుంచి `ఆర్ ఆర్ ఆర్ `త‌ప్పుకోవ‌డంతో ఊహించ‌ని స్థాయిలో థియేట‌ర్ల‌ని ద‌క్కించుకున్నార‌ట‌. `ఆర్ ఆర్ ఆర్‌` త‌ప్పుకోవ‌డంతో సంక్రాంతి రేసులో `బంగార్రాజు`కు భారీ స్థాయిలో థియేట‌ర్లు ల‌భించ‌డం ఖాయం అని చెబుతున్నారు.

తాజాగా `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ ని వాయిదా వేస్తున్నామంటూ మేకర్స్ ప్ర‌క‌టించ‌డంతో `బంగార్రాజు`కు ఇక తిరుగులేద‌ని చెబుతున్నారు. `భీమ్లా నాయ‌క్‌` నుంచి కూడా క్లారిటీ వ‌చ్చేస్తే సంక్రాంతి బ‌రిలో `బంగార్రాజు` కింగ్ కావ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్‌, భీమ్లా నాయ‌క్ త‌ప్పుకోవ‌డంతో నాగార్జున‌కి బంప‌రాఫ‌ర్ త‌గిలిందని అప్పుడే ఇండ‌స్ట్రీలో చ‌ర్చ కూడా మొద‌లైంది.

`బంగార్రాజు` చిత్రంలో నాగ‌చైత‌న్య మ‌రో హీరోగా న‌టిస్తుండ‌గా ర‌మ్య‌కృష్ణ‌, కృతిశెట్టి హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా `వాసివాడి త‌స్సాదియ్యా ...` అంటూ సాగే స్పెష‌ల్ సాంగ్ లో మెస్మరైజ్ చేయ‌బోతోంది. 2016లో వ‌చ్చిన `సోగ్గాడే చిన్నినాయ‌నా` చిత్రానికిది ప్రీక్వెల్ గా రూపొందుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ రిలీజ్ డేట్ జ‌న‌వ‌రి 15 నుంచి మ‌రింత ముందుకు జ‌రిగే అవ‌కాశం వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.