Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కంటెస్టెంట్ కి నాగ్ గిప్ట్

By:  Tupaki Desk   |   18 Dec 2019 6:30 AM GMT
బిగ్ బాస్ కంటెస్టెంట్ కి నాగ్ గిప్ట్
X
బిగ్ బాస్ సీజ‌న్-3 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌రించిన సంగ‌తి తెలిసిందే. సీజ‌న్-2 ఫెయిలైన నేప‌థ్యం లో సీజ‌న్ -3ని స‌క్సెస్ చేసే బాధ్య‌త‌ల్ని నాగ్ త‌నపై వేసుకుని చివ‌రికి గేమ్ షోని ఎలాగూ స‌క్సెస్ చేసారు. అయితే ఆ షోలో అలీరెజా కు కింగ్ ఓ ప్రామిస్ చేసిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌ లో అలీ చాలా స్టైలిష్ గా ఉండేవాడు. అత‌ని డ్రెసింగ్ సెన్స్ చూసి నాగార్జున సైతం ఇష్ట‌ప‌డేవారు. ఒక వీకెండ్ కార్య‌క్ర‌మం లో నాగార్జున ధ‌రించిన బ్రాండెడ్ షూస్ ను అలీ ఇష్ట‌ప‌డ్డాడు.

అలాంటి షూస్ త‌నకి కావాల‌ని నాగార్జున ను కోరాడు. క‌చ్చితంగా గిప్ట్ ఇస్తాన‌ని నాగ్ ప్రామిస్ చేసారు. తాజాగా ఆ ప్రామిస్ ను కింగ్ నిల‌బెట్టుకున్నారు. అలీ రెజాకు నాగ్ ఆ బ్రాండెడ్ షూస్ ని గిప్ట్ గా పంపించారు. దీంతో అలీ ఆనందానికి అవధులే లేవు. నిజంగా మాటమీద నిల‌బ‌డే వ్య‌క్తి నాగార్జున‌. త‌న ఫేవ‌రెట్ బ్రాండ్ షూస్ ని నాగార్జున గిప్ట్ గా పంపించార‌ని అలీ తెలిపాడు. ``ల‌వ్యూ నాగార్జున స‌ర్`` అంటూ అలీ ట్వీట్ చేసాడు. అలాగే నాగార్జున తో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేసాడు.

బిగ్ బాస్ త‌ర్వాత కంటెస్టెంట్ల‌ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ద‌క్కుతోంది. సినిమాల్లో అవ‌కాశాలు అందిపుచుకుంటున్నారు. సీజన్-2 విన్న‌ర్ కౌశ‌ల్.. సీజ‌న్ -3 విన్న‌ర్ రాహుల్ కు సినిమా అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది. బిగ్ బాస్ లో ఎలాంటి గుర్తింపు లేకుండా ఎంట్రీ ఇచ్చి కూడా స‌క్సెస్ అవుతున్నారు. ఆ గుర్తింపును తెలివిగా వాడుకుని సినిమా ఛాన్సులు అందుకుంటున్నారు. అప్ప‌టికే ఐడెంటిటీ ఉన్న వాళ్ల‌కు బిగ్ బాస్ ఇమేజ్ మ‌రింత క‌లిసొస్తోంది. ఇక హిమ‌జ‌- శ్రీ‌ముఖి-పున‌ర్న‌వి -హేమ-భాను-నందిని- గీత‌ వంటి వారి బ్రాండ్ వ్యాల్యూ పెరిగింది. ప్ర‌స్తుతం వీళ్ల‌కు షాపుల ఓపెనింగులు.. రిబ్బ‌న్ క‌టింగుల‌కు క్రేజు నెల‌కొంద‌ని తెలుస్తోంది.