Begin typing your search above and press return to search.
'బంగార్రాజు' బరిలోకొచ్చే వేళ!
By: Tupaki Desk | 3 April 2019 10:30 AM GMT`సోగ్గాడే చిన్ని నాయన` విజయోత్సవ వేడుకలో ఆ చిత్రానికి సీక్వెల్ గా `బంగార్రాజు` తెరకెక్కిస్తామని నాగార్జున ప్రకటించారు. 2016లో ఆ ప్రకటన వచ్చింది. కానీ మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు ఉంటుందా ఉండదా? అన్న డైలమా కొనసాగింది. కళ్యాణ్ కృష్ణ ఈ మూడేళ్లలో ఎన్నో సార్లు కింగ్ కి కథ వినిపించారు. కానీ ఓకే కాలేదు. అవసరం మేర ఆ స్క్రిప్టుకి మెరుగులు అద్దుతూనే ఉన్నాడు. ప్రతిసారీ కింగ్ దగ్గర రిజెక్ట్ అవుతూనే ఉంది. అయితే 2019 ఏప్రిల్ చివరి నాటికి ఈ సీక్వెల్ కి - ఆ స్క్రిప్టుకు మోక్షం రానుందని తెలుస్తోంది.
ఎట్టకేలకు `బంగార్రాజు` కథ .. స్క్రిప్టు పూర్తిగా రెడీ అయ్యాయి. సెట్స్ కెళ్లేందుకు కళ్యాణ్ కృష్ణ రెడీగా ఉన్నాడు. అయితే కింగ్ నాగార్జున `మన్మధుడు 2`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం పోర్చుగల్ షెడ్యూల్ కి రెడీ అవుతోందని తెలుస్తోంది. ఓ ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున `బంగార్రాజు` గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. స్క్రిప్టు బాగా కుదిరింది. రాబోవు ఎన్నికల తర్వాత ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు.
బంగార్రాజు చిత్రంలో నాగార్జున పాత్ర ఎలా ఉంటుంది? అంటే .. సోగ్గాడే చిత్రంలో చిలిపి బంగార్రాజు పాత్రను తిరిగి తెరపై చూసుకునే వీలుంది. ఇక ఈ చిత్రంలో బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య నటించే అవకాశం ఉందని ఇదివరకూ ప్రచారమైంది. బంగార్రాజు - అతని మనవడి మధ్య ఉండే అనుబంధం చుట్టూ అల్లుకున్న కథతో సాగుతుందని తెలుస్తోంది. తాతగా నాగ్ .. మనవడిగా నాగచైతన్య కనిపిస్తారని ఓ టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారికంగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒక దర్శకుడు మూడేళ్ల పాటు ఒకే స్క్రిప్టుపై అంతగా తర్జనభర్జన పడడం అంటే అది ఆషామాషీ కాదు. కానీ కళ్యాణ్ కృష్ణ ఇంతకాలం ఓపిగ్గానే ఎదురు చూశాడు. అన్ని పరీక్షల్ని ఎదుర్కొని ఎట్టకేలకు సెట్స్ కెళుతున్నాడు. తన ఫేవరెట్ స్టార్ కోసం సదరు యువదర్శకుడు ఎంతగానో తపించాడని అర్థం చేసుకోవచ్చు.