Begin typing your search above and press return to search.

మన్మథుడు @59 గ్లామర్ సీక్రెట్స్

By:  Tupaki Desk   |   4 April 2019 1:58 PM IST
మన్మథుడు @59 గ్లామర్ సీక్రెట్స్
X
నిజానికి నాగార్జునతో పాటు పిల్లలు చైతన్య అఖిల్ ని పక్కన నిలుచోబెట్టి తెలియని వాళ్లకు అన్నదమ్ములు అని పరిచయం చేస్తే ఈజీగా నమ్మేస్తారు. అంతగా గ్లామర్ మైంటైన్ చేయడం ఒక్క నాగార్జునకే సాధ్యం. అందుకే 59 వయసులో కూడా మన్మధుడు 2 అన్నా ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి.ఇంత ఫిట్ గా నాగ్ ఎలా ఉండగలుగుతున్నాడు అనే సందేహం ఎవరికైనా వస్తుంది. అసలు ఆ రహస్యాలు ఏమిటి అనే ఉత్సుకత అభిమానుల్లోనే కాదు సామాన్య జనంలోనూ ఉంది . అదేంటో చూద్దాం

నాగ్ రోజు ఖచ్చితంగా 8 లేదా 9 గంటల నిద్రను ఖచ్చితంగా పాటిస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఇది మాత్రం కంపల్సరీ. ఉదయం లేవగానే ఓ గ్లాసు నీళ్ళలో కుంకుమ పువ్వు వేసుకుని పావు గంట తర్వాత తాగెస్తారు. రోజూ ఎప్పుడైనా సరే ఓ అల్లం ముక్క నమలడం నాగ్ అలవాటు. మసాలాలు ఎక్కువగా వాడే ఆయిల్ ఫుడ్ కి కింగ్ దూరం.

గరం మసాలా అంటే అస్సలు పడదు. దాన్ని మాడ్చేసి తింటే అది విషంతో సమానమని చెబుతారు. ఇక నాగ్ ఇష్టపడేది రోటి పచ్చళ్ళు. ఎప్పుడో రెండు నెలల క్రితం తయారు చేసి బెస్ట్ బిఫోర్ అనే పికిల్స్ ని ఇష్టపడరు. బీట్ రూట్ బీరకాయ తొక్కల పచ్చళ్ళు నాగ్ ఫేవరేట్. విటమిన్స్ ఉండటమే కారణం.

రోజు యోగ తప్పనిసరిగా చేయాల్సిందే. వెయిట్ లిఫ్టింగ్ మానేశారు కాని దానికి ప్రత్యాన్మయం యోగా అని నమ్ముతారు. ఇండియాలోనే కాదు ఏ దేశం వెళ్ళినా నాగ్ డైట్ ప్లాన్ ఇదేనట. చూశారుగా ఎంత సింపుల్ గా ఉందో. కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఫాలో కావడం ఈజీనే. హాఫ్ సెంచరీ దాటినా నాగ్ లా ఉండాలంటే ఇవన్ని ఫాలో కావాల్సిందే. ట్రై చేయండి మరి