Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు నాగార్జున - దత్తాత్రేయ ఆహ్వానం
By: Tupaki Desk | 14 Nov 2016 1:34 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం ఇద్దరు ప్రముఖులు కలిసి తమ ఇంట్లో జరిగే వేడుకలకు ఆహ్వానించారు. ప్రముఖ సినీనటుడు నాగార్జునతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేసీఆర్ ను కలిసి తమ ఇంట్లో జరిగే వేడుకలకు ఆహ్వానం పలికారు.
నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డితో డిసెంబర్ 9న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున కేసీఆర్ ను చాలా ముందుగానే కలిసి ఈ ఎంగేజ్ మెంట్ కు రావాలని ఆహ్వానించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నాగార్జున ఆస్తులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున అఖిల్ ఎంగేజ్ మెంట్ కు సైతం కేసీఆర్ ను ఆహ్వానించడం విశేషం.
ఇక కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన కుమార్తె వివాహానికి రావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. దత్తాత్రేయకు కేసీఆర్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం తెలిసిందే. కేసీఆర్ దత్తాత్రేయ కేంద్ర మంత్రి అయినప్పుడు ఆయన్ను ప్రత్యేకంగా సన్మానించారు. ఇక ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఏపీకి వెంకయ్యనాయుడు ఎలాగో...తెలంగాణకు దత్తాత్రేయ అని కూడా కీర్తించిన సంగతి తెలిసిందే.
ఇక ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా సైతం కేసీఆర్ ను కలిసి తన చెల్లి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. తండ్రితో కలిసి ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సానియా.. తన చెల్లి పెళ్లికి సంబంధించిన శుభలేఖను కేసీఆర్ కు అందించి తప్పకుండా రావాలని కోరిన విషయం తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/