Begin typing your search above and press return to search.
కొన్నాళ్ల పాటు దేశం దాటేది లేదంటున్న నాగార్జున
By: Tupaki Desk | 29 May 2021 1:30 PM GMTటాలీవుడ్ తో పాటు ఇతర భాషల ఇండియన్ సినిమాలు ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోవడం చాలా కామన్. స్టార్ హీరోల ఎక్కువ సినిమాలో చిన్న షెడ్యూల్ కోసం అయినా విదేశాలకు వెళ్లడం కామన్ గా జరుగుతుంది. అదంతా ఒకప్పుడు. కాని ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారింది. విదేశాల్లో షెడ్యూల్స్ అంటే హీరోలు కాస్త భయపడుతున్నారు. బాబోయ్ ఈ సమయంలో ఇక్కడ షూటింగ్ అంటేనే కష్టంగా ఉంది ఇక విదేశాల్లో షూటింగ్ అంటే ఇంకెలా ఉంటుందో అనే ఆందోళన చాలా మందిలో కనిపిస్తుంది.
నాగార్జున విదేశీ షెడ్యూల్ ను కొన్నాళ్ల పాటు పూర్తిగా అవైడ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మరియు చేయబోతున్న సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తిగా ఇండియాలోనే ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడట. విదేశాల్లో ఒకటి రెండు వారాల షెడ్యూల్ ను కూడా ఆయన కోరుకోవడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ లకు హాజరు అవ్వడమే చాలా సీరియస్ విషయం. ఇక విదేశాల్లో చిత్రీకరణ అంటే వద్దు బాబు అన్నట్లుగా నాగ్ దర్శకులతో వ్యాఖ్యలు చేశాడట.
ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఇందులో రా ఏజెంట్ గా నాగార్జున కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గిన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. దాంతో పాటు బంగార్రాజు సినిమా ను కూడా నాగార్జున లైన్ లో పెట్టాడు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇవి అవి మొత్తం కూడా పూర్తిగా ఇండియాలో అది కూడా సాధ్యం అయినంత వరకు హైదరాబాద్ చుట్టు పక్కల మాత్రమే చేయాలని నాగార్జున భావిస్తున్నాడట. ఈ సమయంలో నాగార్జున తీసుకున్న నిర్ణయం అభినందనీయమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.