Begin typing your search above and press return to search.
600 సంవత్సరాలు వెనక్కు..!
By: Tupaki Desk | 25 Sep 2018 6:59 AM GMTఅక్కినేని నాగార్జున వయసు రీత్యా ఇకపై మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. సోలో హీరోగా కంటే ఎక్కువగా ఇతర హీరోలతోనే స్క్రీన్ ను షేర్ చేసుకునేందుకు నాగార్జున ఆసక్తి చూపుతున్నట్లుగా తాజాగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. తాజాగా నాగార్జున ‘దేవదాస్’ చిత్రాన్ని నానితో కలిసి చేసిన విషయం తెల్సిందే. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘దేవదాస్’ చిత్రంపై నాగార్జున చాలా అంచనాలు పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తన తదుపరి చిత్రాల గురించి చిన్న క్లారిటీలు ఇచ్చేశాడు.
హిందీలో తాను నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో ఫుల్ లెంగ్త్ పాత్ర కాదని - అర్థ గంట కనిపించే ఒక గెస్ట్ రోల్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి తాను బ్రహ్మాస్త్ర గురించి ఎక్కువగా చెప్పలేను అంట దాట వేశాడు. ఇక మరో వైపు తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న చిత్రంలో ధనుష్ తో కలిసి నాగార్జున నటించబోతున్నాడు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ హీరోగా నటిస్తున్న ఆ చిత్రంలో తన పాత్ర 600 ఏళ్ల క్రితం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని పేర్కొన్నాడు. ధనుష్ తో మల్టీస్టారర్ గురించి ఇప్పుడు ఇతర వివరాలను చెప్పలేను అన్నాడు.
ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఒక పీరియాడిక్ మూవీ అంటూ నాగార్జున మాటల ద్వారా అర్థం అయ్యింది. పీరియాడిక్ సినిమాలను తీయాలంటే చాలా అనుభవం ఉండాలి. ధనుష్ కేవలం ఒక్క సినిమా అనుభవంతో ఈ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. మొదట ఈ చిత్రంను 100 కోట్ల బడ్జెట్‌తో తీయాలని భావించాడు. రజినీకాంత్ స్థానంలో నాగార్జునను తీసుకోవడంతో పాటు, మరికొన్ని ఇతర కారణాల వల్ల 100 కోట్లు అంటే మరీ రిస్క్ అనే ఉద్దేశ్యంతో 70 కోట్లకు బడ్జెట్ తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో పీరియాడిక్ చిత్రాలు తెగ వస్తున్నాయి. మరి ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.