Begin typing your search above and press return to search.
ఇంతకీ అసలు బంగార్రాజు నాగ్ కాదా?
By: Tupaki Desk | 11 Jan 2022 3:30 AM GMTకింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతికి సందడి చేయబోతోంది. బ్లాక్ బస్టర్ హిట్ `సోగ్గాడే చిన్నినాయన` కు స్రీక్వెల్ గా రూపొందిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి బరిలో నిలిచిన పాన్ ఇండియా చిత్రాలు `ఆర్ ఆర్ ఆర్`, రాధేశ్యామ్ వాయిదా పడటంతో ఈ సంక్రాతి `బంగార్రాజు`దే అంటున్నారు. ఈ సినిమా మినహా పెద్ద చిత్రమేదీ బరిలో లేకపోవడంతో కింగ్ నాగార్జునకు బాగా కలిసి వచ్చిందని, ఆయన లక్కు మామూలుగా లేదని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటున్నారు.
సంక్రాంతి వార్ వన్ సైడ్ గా మారిపోవడంతో `బంగార్రాజు` టీమ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాలని మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా సంక్రాంతికి స్పెషల్ ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారు. ఇందులో టీమ్‌తో కలిసి పాల్గొన్న నాగచైతన్య అసలు బంగార్రాజు వేరే వున్నాడని షాకిచ్చాడు. అసలు బంగార్రాజు దర్శకుడు కల్యాణ్ కృష్ణనే అని అసలు విషయం బయటపెట్టేశాడు.
పంచెకట్టు అంటే ఏఎన్నార్ చాలా ఫేమస్..ఆ తరువాత ఆ స్థాయిలో పంచెకట్టుతో బంగార్రాజుగా అదరగొట్టారు నాగార్జున గారు. ఈ సినిమాలో మీరు చిన బంగార్రాజుగా నటించారు కదా? ఆ పంచెకట్టుని ప్రత్యేకంగా ఆ లుక్ లో కనిపించడానికి ఏదైనా కసరత్తులు చేశారా? అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి చై ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. `సోగ్గాడే చిన్ని నాయన` సినిమా చూసి నా పాత్ర ఎలా వుండాలో ఓ అవగాహనకు వచ్చానని, అంతే కాకుండా దర్శకుడు కల్యాణ్ లోపల బంగార్రాజు క్యారెక్టర్ వుంది. కీ ఇస్తే చాలు ఆయనలో వున్న ఆ క్యారెక్టర్ బయటికి వచ్చేస్తుంది. పైగా అసలు బంగార్రాజు ఆయనే అని చెప్పి షాకిచ్చారు.
డైరెక్టర్ బయటికి కనిపించని పూలరంగడని కల్యాణ్ కృష్ణ అసలు సీక్రెట్ బయటపెట్టాడు చైతన్య. ఇక సీన్ చేసే ముందు పాత్ర ఎలా వుండాలో, ఆ పాత్ర మేనరిజమ్స్ ఏంటో... స్లాంగ్ ఎలా మాట్లాడాలో నేర్పించారని, నాన్న తో షూటింగ్ చేసిన తరువాత ఆయన ఎలా స్లాంగ్ లో డైలాగ్‌లు పలుకుతున్నారో రికార్డ్ చేసి మరీ నాకు పంపించి ఫాలో అయిపొమ్మనే వారని అలా కల్యాణ్ కృష్ణ వల్లే చినబంగార్రాజు పాత్రని చేయగలిగానని చెప్పుకొచ్చారు నాగచైతన్య.
నాగ్ సెంటిమెంట్ గా భావించి ఐదేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేయించి తెరపైకి తీసుకొచ్చిన సినిమా ఇది. కథకు ఐదేళ్లు పట్టినా సినిమాని మాత్రం నాలుగు నెల్లో పూర్తి చేయడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. ఈ సంక్రాంతికి సందడి చేయనున్న ఈ మూవీతో కింగ్ నాగార్జున సెంటిమెంట్ రిపీట్ కావాలని అక్కినేని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.