Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 6 : నాగార్జుననే తప్పుపట్టిన ఇద్దరమ్మాయిలు
By: Tupaki Desk | 2 Oct 2022 11:30 AM GMTబిగ్ బాస్ సీజన్ 6 నాల్గవ వారం శనివారం ఎపిసోడ్ లో ఇద్దరు అమ్మాయిలు నాగార్జున నిర్ణయాన్ని తప్పుపట్టిన సంఘటన చోటు చేసుకుంది. వారు బాహాటంగా నాగార్జునను తప్పపట్టలేదు.. కానీ వారి చర్యల వల్ల వారు నాగార్జున నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నట్లుగా మాట్లాడారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొదటగా కీర్తి భట్ తనను కెప్టెన్ అయినందుకు నాగార్జున అభినందించలేదు.. చీరప్ ఇవ్వలేదు అంటూ బ్రేక్ సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో ఆమెను ఇంటి సభ్యులు సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నాగార్జున కూడా ఏం జరిగిందని ప్రశ్నించగా మీ నుండి చీరప్ కోరుకున్నాను సర్ కానీ అది నాకు రాకపోవడంతో బాధ కలిగిందని చెప్పింది.
అందుకు నాగార్జున నీ నుండి ఇంకా ఆశిస్తున్నాను.. నేను ఆశించిన స్థాయిలో నువ్వు ఆడిన తర్వాత అప్పుడు నువ్వు అడగకున్నా కూడా నా నుండి చీరప్ వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ విషయం పూర్తి అయిన వెంటనే వాసంతి కృష్ణన్ కూడా హోస్ట్ నాగ్ పై ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.
వారం అంతా కూడా హోటల్ టాస్క్ లో ది బెస్ట్ అన్నట్లుగా నిలిచాను అని.. నా వంతుగా చాలా కష్టపడ్డాను. అయినా కూడా నాగార్జున గారు 200 రూపాయలు మాత్రమే నాకు టిప్ అంటూ ప్రకటించడం చాలా బాధ వేసిందని కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఆ టిప్ కు సంతృప్తి చెందలేదు అంటూ ఆ సమయంలోనే వాసంతి అన్నది.
నాగార్జున బై చెప్పిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయ్యింది. నేను బాగా ఆడాను ఆడాను అంటూ ఇంటి సభ్యుల వద్ద మళ్లీ మళ్లీ చెప్పింది. మొత్తానికి ఈ ఇద్దరు నాగార్జున మాట్లాడిన మాటలకు కాస్త వ్యతిరేకంగా నే మాట్లాడారు. మరి వీరికి బిగ్ బాస్ టీమ్ నుండి ఏమైనా వార్నింగ్ అంది ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.