Begin typing your search above and press return to search.
నాగ్ గడ్డం బాగా వాడుతున్నాడుగా!
By: Tupaki Desk | 21 Jun 2016 4:19 AM GMTనాగార్జున సహజంగా సినిమాలు స్పీడ్ గా చేస్తాడు. మనం తర్వాత ఎలర్ట్ ఎక్కువైపోయి స్లో అయిపోయాడు కానీ.. నాగ్ స్పీడ్ లో సినిమాలు చేయడం చాలా మందికి కష్టమైన విషయం. కానీ గత మూడు నెలలుగా నాగ్ ముఖానికి మేకప్ కూడా వేసుకోలేదు. ఈవెంట్ల కోసం మినహాయిస్తే.. ఏ సినిమా షూటింగ్ లోనూ పాల్గొనలేదు.
ప్రస్తుతానికి నాగ్ చేస్తున్న సినిమా ఓం నమో వెంకటేశాయ. ఇందులో శ్రీనివాసుడి పరమ భక్తుడైన హథీరాం బాబా కేరక్టర్లో నాగ్ కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం బాగా గడ్డం పెంచాడు కూడా. ఇప్పుడా గెడ్డం గెటప్ ని నాగార్జున వాడేస్తున్న విధానం చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవుతుంది. మూడు నెలల తర్వాత షూటింగ్ కి వచ్చిన నాగ్.. నిర్మలా కాన్వెంట్ చిత్రం కోసం ఓ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నాడు. హీరో శ్రీకాంత్ కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. నాగ్ నిర్మిస్తున్న మూవీ నిర్మలా కాన్వెంట్.
నిర్మలా కాన్వెంట్ లో నాగ్ పై షూట్ చేస్తున్న స్పెషల్ సాంగ్ కోసం ఈ గెడ్డాన్ని ఓ మేకోవర్ రేంజ్ లో తయారు చేసి ఉపయోగించేశాడు నాగార్జున. అటు హథీరాం బాబా గెటప్ కోసం గెడ్డం కావాల్సిందే కాబట్టి.. దాన్ని తీసే ఛాన్స్ లేక.. ఇలా మేకోవర్ టైపులో కలరింగ్ ఇచ్చాడన్న మాట. ఏమైనా ఓ కాన్సెప్ట్ ని ఇలా రకరకాలుగా ఉపయోగించడం అంటే.. నాగార్జున తర్వాతే ఎవరైనా!