Begin typing your search above and press return to search.

సమంతని నాగ్ ఏమని పరిచయం చేశాడో!!

By:  Tupaki Desk   |   29 Aug 2016 4:44 AM GMT
సమంతని నాగ్ ఏమని పరిచయం చేశాడో!!
X
అక్కినేని నాగచైతన్య-సమంత లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ చాలా రోజులుగా ఉంది. ఈ మధ్య ఈ టైపు వార్తల డోస్ కొంచెం తగ్గింది కానీ.. అసలు విషయం అయితే ఇంకా నానుతూనే ఉంది. ఇప్పుడు సడెన్ గా మళ్లీ వీళ్లిద్దరి అఫైర్ తో పాటు.. మధ్యలోకి నాగార్జున పేరు కూడా వచ్చి చేరింది. చైతు-శామ్స్ ల పెళ్లికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసుంటారన్నది ఇండస్ట్రీ టాక్. కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ.. ఇప్పుడో సంఘటన ఈ వాదనకు బలాన్నిచ్చింది.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నిన్న హైద్రాబాద్ కు వచ్చాడు. ఒలింపిక్ మెడల్ విన్నర్స్ కు బీఎండబ్ల్యూలు కారులు ప్రజెంట్ చేయడంతో పాటు.. ప్రొడ్యూసర్ నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి పెళ్లి ఫంక్షన్ కు కూడా సచిన్ హాజరయ్యాడు. ఈ ఫంక్షన్ లో సచిన్ అండ్ నాగార్జునలు మాట్లాడుకోవడం సంతరించుకుంది. మాటల్లో భాగంగా తన కొడుకు నాగచైతన్యను సచిన్ కు ఇంట్రడ్యూస్ చేశాడు నాగార్జున. ఆ తర్వాత సమంతను కూడా టెండూల్కర్ కు ఇంట్రడ్యూస్ చేశాడు. చైతును పరిచయం చేయడం పెద్ద విషయం కాదు కానీ.. ఇంతకు సమంతను ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చింది? చూపరులకు ఇదే షాక్.

అక్కడే అదే పార్టీలో ఉన్న మీడియా వారు.. నాగ్ ఏమని శామ్స్ ని పరిచయం చేసుంటాడు అంటూ ఆలోచించడం ప్రారంభించారు. ఆల్రెడీ ఆ పక్కనే అఖిల్ అండ్ శ్రీయ భూపాల్ కూడా చెక్కర్లు కొడుతున్నారులే. ఇకపోతే ఇప్పుడు చాలా ప్రశ్నలకు మనకు ఈజీ ఆన్సర్స్ దొరికేసినట్లే కదా.