Begin typing your search above and press return to search.

నాగ్ పుణ్యమే అంటున్న లావణ్య

By:  Tupaki Desk   |   23 Oct 2017 7:15 AM GMT
నాగ్ పుణ్యమే అంటున్న లావణ్య
X
టాలీవుడ్లో అక్కినేని నాగార్జునను చాలామంది ఫిట్నెస్ గురుగా భావిస్తారు. 60 ఏళ్లకు దగ్గరపడుతూ కూడా ఆయన ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న తీరుకు అందరూ అబ్బురపడుతుంటారు. నాగ్ తో కలిసి పని చేసేవాళ్లందరూ ఆయన దగ్గర ఫిట్నెస్ సలహాలు తీసుకుంటుంటారు. ఫిట్నెస్ విషయంలో తనకు నాగార్జున స్ఫూర్తి అని పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు చెప్పడం చూశాం.

ఇప్పుడు హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా తాను పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనుక నాగ్ సలహాలు ఉన్నట్లు చెప్పడం విశేషం. ఆరేడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎన్నడూ ఫిజిక్ విషయంలో అదుపు తప్పకుండా.. రోజు రోజుకూ మరింత నాజూగ్గా ఎలా తయారవగలుగుతున్నారు అని లావణ్యను అడిగితే.. ‘మనం’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి సినిమాలకు పని చేసేటపుడు నాగ్ చెప్పిన పాఠాలు తనకెంతో ఉపకరించాయని చెప్పింది. వ్యాయామమే తను ఇలా అందంగా ఉంచుతోందని చెప్పింది.

ఇక సినిమాల విషయంలో తన అభిరుచుల గురించి లావణ్య చెబుతూ.. తనకు హార్రర్ సినిమాలంటే చాలా ఇష్టమని, అవి చూస్తుంటానని.. కానీ అలాంటి సినిమాల్లో నటించడం మాత్రం తనకు ఇష్టముండదని అంది. తనకు లవ్ స్టోరీలంటే అంతగా ఆసక్తేమీ ఉండదని, అవి చూడటం తక్కువని.. అయినప్పటికీ తాను కెరీర్లో ఎక్కువగా లవ్ స్టోరీలే చేస్తున్నానని తెలిపింది. తన కొత్త సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’లో తన పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని.. ఇది తనకు మనసుకు దగ్గరైన సినిమా అని చెప్పింది లావణ్య.