Begin typing your search above and press return to search.

నాగ్ సరదాగా జోస్యం చెప్పేస్తున్నాడే

By:  Tupaki Desk   |   3 Feb 2018 11:42 AM IST
నాగ్ సరదాగా జోస్యం చెప్పేస్తున్నాడే
X
సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడు అయినా లేడి ఆర్టిస్టులతో కాస్త చనువుగా ఉన్నారంటే చాలు రూమర్స్ ఓ రేంజ్ లో వస్తాయి. ఇక హీరో హీరోయిన్స్ ఆ రూట్ లో కొంచెం దగ్గరగా వచ్చినా సరే లేనిపోని అనుమానాలు సృష్టించడం ఈ రోజుల్లో కామన్. కానీ నవమన్మదుడు నాగార్జున మాత్రం తన కెరీర్లో ఎంత మంది హీరోయిన్స్ తో చనువుగా ఉన్నప్పటికీ నెగిటివ్ కామెంట్స్ అంతగా రాలేదు. నాగ్ లిమిట్ దాటకుండా ఫ్రెండ్లిగా ఉండడమే అందుకు కారణమని చాలా మంది చెబుతుంటారు.

ఇకపోతే నాగ్ ఏ హీరోయిన్ తో నటించినా వారిని ఇట్టే ఆకర్షిస్తాడు. రీసెంట్ గా వర్మ సెట్ చేసిన ఒక హీరోయిన్ కు నాగ్ ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్‌ చేసి ఆమెను ఆనందంలో పడేశాడని తెలుస్తోంది. నాగార్జున గారు ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్‌ చేస్తున్నారు నాకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పారని చాలా ఆనందపడుతోంది ఓ బ్యూటీ. ఆమె ఎవరో కాదు. ఆర్జీవీ - నాగ్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న మైరా సరీన్‌. ఆమెను వర్మ ఓ పార్టీలో చూసి హీరోయిన్ గా సెట్ చేసుకున్నాడట.

అయితే నాగార్జున షూటింగ్లో ఆమెతో అప్పుడపుడు సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడట. రీసెంట్ గా మైరా సరీన్‌ నాగార్జున గారు ఫ్యూచర్‌ ని ప్రెడిక్ట్‌ చేశారని తెలిపింది. తన చేతి రేఖలను చూసి సినిమా ఇండస్ట్రీలో నీకు మంచి లైఫ్ ఉంది. అవకాశాలు చాలా వస్తాయని చెప్పారట.దీంతో అమ్మడు చాలా ఆనందపడిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఆ సినిమాకు శపథం: మై రివెంజ్‌ కంప్లీట్‌ అనే టైటిల్ ని అనుకున్నట్లు టాక్.