Begin typing your search above and press return to search.

లైవ్ థియేట్రికల్ ట్రైలర్ అదిరిందిగా..

By:  Tupaki Desk   |   25 Dec 2015 10:58 PM IST
లైవ్ థియేట్రికల్ ట్రైలర్ అదిరిందిగా..
X
రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటే.. డిఫరెంట్ గా ప్రయోగాలు చేయడానికి కూడా అక్కినేని నాగార్జున ఇంపార్టెన్స్ ఇస్తారు. డైరెక్టర్లని స్టోరీనే కాదు.. ప్రచారంలో కొత్త కాన్సెప్ట్ లను పరిచయం చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కోసం.. లైవ్ థియేట్రికల్ ట్రైలర్ ఇస్తామని ముందే అనౌన్స్ చేసి.. ఆసక్తి కలిగించారు.

థియేట్రికల్ ట్రైలర్ తెలుసు, లైవ్ తెలుసు.. మరి లైవ్ థియేట్రికల్ ట్రైలర్ ఏంటనే ఆసక్తి జనరేట్ అయింది. ఈ రెండింటినీ సమ పాళ్లలో మిక్స్ చేసి లైవ్ థియేట్రికల్ ట్రైలర్ చేశారు. సోగ్గాడే చిన్ని నాయన కోసం నాగ్ లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తారని ముందునుంచే సమాచారం ఉంది. దాన్ని కూడా ఈ కొత్త కాన్సెప్ట్ కోసమే ఉపయోగించారు. సాధారణంగా సినిమాలో పాటలకు డ్యాన్సర్లతో ప్రోగ్రామ్ ఇప్పిస్తుంటారు.

కానీ సోగ్గాడే చిన్ని నాయన కోసం.. వరుసగా హీరోయిన్స్ సాంగ్ టీజర్లకు పెర్ఫామ్ చేస్తుంటే.. చివర్లో నాగ్ వచ్చి మొత్తానికి ఫినిషింగ్ ఇచ్చిన థీమ్ బాగుంది. మొదట అనసూయ సోగ్గాడే చిన్ని నాయన టైటిల్ సాంగ్ కు డ్యాన్స్ చేయగా.. తర్వాత లావణ్య త్రిపాఠి వచ్చి మరో సాంగ్ కు స్టెప్పులేసింది. తర్వాత నాగ్ వచ్చి ఈ ఇద్దరినీ చెరోమారు పిలిచి తన స్టైల్లో డ్యాన్స్ కుమ్మేశారు. చివర్లో రమ్యకృష్ణ, హంసానందినిలను కూడా పిలిచి.. ఓ పెద్ద బుల్లెడ్ పై వరుసగా కూర్చున్నట్లుగా ఇచ్చిన పోజ్ సూపర్బ్ గా ఉంది. నలుగురు భామల మధ్య పంచె కట్టులో నాగ్ భలే మెరిసిపోయారు.