Begin typing your search above and press return to search.
'మన్మధుడు 2' ముహూర్తం ఫిక్స్
By: Tupaki Desk | 18 March 2019 8:51 AM GMTయాభై వయసులోనూ మగువల గుండెల్లో అభినవ మన్మధుడిగా వెలిగిపోతున్నారు కింగ్ నాగార్జున. సినిమాల పరంగా అంతకంతకు స్పీడ్ పెంచేస్తున్నారు. ఇన్నాళ్లు స్క్రిప్టు సహా చాలా విషయాల్లో క్లారిటీ కోసం వేచి చూసిన నాగార్జున ఇకపై సెట్స్ కెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా మన్మధుడు 2 నా? లేక బంగార్రాజు సెట్స్ కెళతాడా? అంటూ కొంతకాలంగా అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఈ విషయంలో కింగ్ పూర్తి క్లారిటీకి వచ్చేశారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 25న మన్మధుడు 2 మొదలవుతోంది. అదే రోజు నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళతారట. అందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చి.ల.సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్క్రిప్టు విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చేశారట. స్క్రిప్టు వంద శాతం నాగార్జునకు నచ్చింది. అందుకే ఇక సెట్స్ కెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు. ఆరంభం 10-15 రోజుల షెడ్యూల్ చేస్తారట. అటుపై మరో మూడు భారీ షెడ్యూల్స్ ఉంటాయని తెలుస్తోంది. 2020 సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా బరిలో దిగుతున్నారట. ఇప్పటికే అందాల రకుల్ ప్రీత్ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే.
రొమాన్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్ ని పెర్ఫెక్ట్ లెంగ్త్ తో చూపించగలిగే సెన్సిబిలిటీస్ రాహుల్ రవీంద్రన్ లో ఉన్నాయనడంలో సందేహమేం లేదు. తొలి ప్రయత్నమే సుశాంత్ లాంటి హీరోని `చి.ల.సౌ` చిత్రంలో కొత్తగా చూపించగలిగాడు. అందుకే రాహుల్ పై ఎంతో నమ్మకంతో నాగార్జున ఈ అవకాశం ఇచ్చారట. కొత్త దర్శకుల్ని నమ్మి ముందుకెళ్లడం నాగార్జున స్టైల్. ఆయన కెరీర్ లో ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు. రామ్ గోపాల్ వర్మ సహా ఎందరో దర్శకులకు ఆయన అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. అయితే రాహుల్ రవీంద్రన్ `మన్మధుడు` రేంజ్ హిట్టిచ్చి ఆ పేరు నిలబెట్టాల్సి ఉంటుంది. సెన్సిబుల్ దర్శకుడు కె.విజయ భాస్కర్ ప్రారంభించిన `మన్మధుడు` ఫ్రాంఛైజీని ముందుకు నడిపించే సత్తా తనకు ఉందని నిరూపించాల్సి ఉంటుంది.