Begin typing your search above and press return to search.
నాగార్జున సోలోగా రావడం లేదు!
By: Tupaki Desk | 4 Aug 2019 9:15 AM GMTఆగస్ట్ 2 ముగిసిపోయి ఓ సక్సెస్ తో అంతంతమాత్రంగా ఉన్న మరో యావరేజ్ తో కొత్త శుక్రవారానికి దారి తీసింది. ఇప్పుడు అందరి కళ్ళు అక్కినేని నాగార్జున మన్మథుడు 2 మీదే ఉన్నాయి. చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ తో పాటు ఆడియో కూడా మంచి స్పందనే దక్కించుకుంటోంది. కానీ 9వ తేది నాగ్ కు పోటీ లేకుండా పోలేదు. ఒక్కొక్కరుగా తమ సినిమాలను రంగంలోకి దించుతున్నారు. ఒక్క రోజు గ్యాప్ తో సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్టను ఇంతకు ముందే ఫిక్స్ చేశారు.
యాంకర్ అనసూయ కథనం మాత్రం అదే రోజు నాగార్జునతో పోటీకి సై అంటోంది. ఇవి చాలవు అన్నట్టు కన్నడలో భారీ బడ్జెట్ తో రూపొందిన కురుక్షేత్ర తెలుగులోనూ 9నే విడుదలవుతోంది.ఇందులో ఉన్న యాక్టర్స్ మనకు పెద్దగా తెలిసినవాళ్లు లేకపోయినా అర్జున్-స్నేహ లాంటి ఆర్టిస్టులతో పాటు మహాభారత గాధ ఆధారంగా తీసిన విజువల్ ఎఫెక్ట్స్ మూవీ కావడంతో టాక్ బాగా వస్తే నిలబడే ఛాన్స్ లేకపోలేదు
ఇవేవి నాగార్జున ఇమేజ్ పరంగా మార్కెట్ లెక్కల్లో సమానమైనవి కాదు కాని కేవలం మౌత్ పబ్లిసిటీ మీద ఆధారపడి వస్తున్నవి. ఒకవేళ వాటిలో ఒకటో రెండో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు కాని నాగ్ ని టేకోవర్ చేసేంత సీన్ ఉంటుందని అభిమానులు అనుకోవడం లేదు.
ప్రతి వారం రెండు మూడు సినిమాలు క్యు కడుతున్న నేపధ్యంలో వారం రోజుల గడువు ప్రతి మూవీకి లైఫ్ అండ్ డెత్ లాగా మారిపోయింది. నాగ్ కాబట్టి మన్మధుడికి స్పాన్ ఎక్కువగా ఉంటుంది కాని మిగిలినవి ఆపై వారం రణరంగం-ఎవరు వచ్చాక కూడా స్ట్రాంగ్ గా కొనసాగాలి అంటే ఖచ్చితంగా మాములు హిట్ అయితే సరిపోదు. మొత్తానికి పోరైతే రసవత్తరంగా మారడం ఖాయమనిపిస్తోంది