Begin typing your search above and press return to search.
నాగ్ లెక్క తప్పింది
By: Tupaki Desk | 10 Aug 2019 5:30 PM GMTకింగ్ నాగార్జున లేటెస్ట్ సినిమా 'మన్మథుడు 2' నిన్నే గ్రాండ్ గా రిలీజయింది. 'చిలసౌ'తో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. మన్మథుడు టైటిల్ పెట్టుకోవడంతో సినిమా పై మొదట్లోనే క్రేజ్ వచ్చింది. ఇక టీజర్ - ట్రైలర్ లో రొమాంటిక్ డోస్ ఎక్కువైందనే టాక్ వచ్చినా నాగ్ ఈసారి మళ్లీ హిట్టు కొట్టడం గ్యారెంటీ అనుకున్నారు అక్కినేని ఫ్యాన్స్. తీరా చూస్తే మొదటి షోకే ఫ్లాప్ టాక్ వచ్చేసింది.
సినిమా చూసిన నెటీజర్లు సోషల్ మీడియా వేదికగా నాగార్జున గారూ ఏంటండీ..? ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారంటూ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి 'మన్మథుడు 2' అనగానే నాగ్ మళ్లీ అలాంటి కామిక్ క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేస్తాడని అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులను నిరాశ పరిచాడు కింగ్. సినిమాలో నాగ్ కామెడీ పండకపోగా రొమాంటిక్ డోస్ మరీ ఎక్కువైపోయింది. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీతో సినిమా కెళ్లినవాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. సినిమా ప్రారంభమైన దాదాపు 15-20 నిమిషాల దాకా నాగ్ రొమాంటిక్ ఆంగిల్ లొనే కనిపిస్తాడు.
కొందరయితే ఈ సినిమా కోసం ఫ్రెంచ్ సినిమా రీమేక్ రైట్స్ తెచ్చుకోవడం ఎందుకని తెలుగు సినిమాల్లో ఎప్పటి నుండో చూస్తున్న కథే కదా అంటూ ట్వీట్స్ వేశారు కూడా. ఏదేమైనా నాగ్ ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో మళ్లీ బాక్సాఫీస్ దగ్గర 'మన్మథుడు'గా సత్తా చాటాలనుకున్నాడు. కానీ ఈసారి కూడా నాగ్ లెక్క తప్పింది. మరి నెక్స్ట్ సినిమాతో అయినా నాగ్ హిట్టు కొడతాడేమో చూడాలి.