Begin typing your search above and press return to search.

చై, అఖిల్.. పెళ్లిచూపులుపై నాగ్

By:  Tupaki Desk   |   10 Sept 2016 11:29 AM IST
చై, అఖిల్.. పెళ్లిచూపులుపై నాగ్
X
అక్కినేని నాగార్జున ఓ విషయాన్ని డీల్ చేయాలని అనుకుంటే.. ఇక దాన్ని సాధ్యం చేసేవరకూ ఎంత మాత్రం రాజీపడరు. ఇప్పటివరకూ నాగచైతన్య.. అఖిల్ లు ఏ సినిమాలు చేయాలో వారి ఇష్టానికి తలూపిన నాగ్.. ఇప్పుడు మాత్రం తన కాన్సంట్రేషన్ ని ఫుల్లుగా వారి కెరీర్ పై పెట్టేశాడనే విషయం తెలుస్తోంది. తను హథీరాం బాబాగా సినిమా చేసేకుంటూ.. ఇటు ఇద్దరు కుమారుల సినిమాలకు స్టోరీల నుంచి నిర్మాణం వరకూ అన్నీ తానే చూసుకుంటున్నాడు. అందుకే ట్యాలెంట్ ఉన్న ప్రతీ ఒక్క డైరెక్టర్ తోనూ.. మాట్లాడుతున్నారు. అలా మాట్లాడనని కూడా చెబుతుండడం విశేషమే.

పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ ని ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడినట్లు నాగ్ చెబుతున్నాడు. ' ఏ నటుడు అయినా కథకు అనగుణంగానే నటించాలి. పెళ్లిచూపులు మూవీ నాకు ఎంతగా నచ్చిందంటే.. దర్శకుడు భాస్కర్ తరుణ్ ని ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడాను. నా హండ్రెడ్ డేస్ సినిమాలు గుర్తుకొచ్చాయని కూడా చెప్పాను. అయితే ఈ దర్శకుడిని నాతో సినిమా చేయమని అనలేదు. అఖిల్‌ - నాగచైతన్యలకు స్టోరీలు రెడీ చేయాల్సిందింగా అడిగా' అని చెప్పాడు నాగార్జున.

ఈ మధ్య కొత్త దర్శకులొస్తున్నారని.. చాలా కొత్తగా ఆలోచిస్తున్నారన్న నాగ్.. స్టార్ ల దగ్గరకు కాకుండా.. వాళ్ల కథకు సరిపోయేవారి దగ్గరకు వెళ్లడం ఇండస్ట్రీకి చాలా మంచిది అంటున్నారు.