Begin typing your search above and press return to search.
నాగార్జున తో శర్వానంద్..?
By: Tupaki Desk | 24 Aug 2018 6:09 AM GMTటాలీవుడ్ లో మల్టీ స్టారర్ యుగం మళ్లీ ప్రారంభమయింది. వెంకటేశ్ - నాగార్జున - మహేశ్ బాబు - లాంటి హీరోలు.. మరో హీరోతో నటించడానికి ఎలాంటి భేషజాలు చూపించకపోవడం శుభపరిణామం అనే చెప్పాలి. ప్రస్తుతం నాగార్జున- నానీ 'దేవదాస్' - వెంకటేశ్- వరుణ్ తేజ 'ఎఫ్-2' - వెంకటేశ్-నాగచైతన్య 'వెంకీమామ' చిత్రాలు తెరకెక్కుతుండగా.. నాగార్జున మరో మల్టీస్టారర్ కు సిద్ధమవుతుండడం విశేషంగా మారింది. టాలీవుడ్ లో ఒక బడా ప్రొడక్షన్ హౌస్ వీరిద్దరి మల్టీస్టారర్ కు రంగం సిద్ధం చేస్తోంది. ఒక యువ దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయిన నాగ్ - శర్వానంద్ ఈ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ప్రస్తుతం నాగార్జున నానీతో 'దేవదాస్' చిత్రం చేయడంతో పాటు.. మలయాళం - హిందీ లో సైతం మల్టీస్టారర్స్ కు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో శర్వానంద్ తో చేయనున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'శతమానం భవతి' - 'మహానుభావుడు' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శర్వానంద్ .. తొలిసారిగా ఒక సీనియర్ హీరోతో స్ర్కీన్ షేర్ చేసుకుంటూండడం మరో విశేషం. టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేశ్ లు పరస్పరం ఎప్పుడూ మల్టీస్టారర్స్ సిద్ధపడలేదు. అయితే వీరిలో నాగార్జున - వెంకటేశ్ మాత్రం తమ కన్నా చిన్న హీరోలతో మల్టీస్టారర్స్ కు సిద్ధపడుతుండడం ఎంతైనా ప్రశంసనీయం.