Begin typing your search above and press return to search.

నాగ్ సార్ మీరు కూడానా!

By:  Tupaki Desk   |   13 Nov 2018 1:30 AM GMT
నాగ్ సార్ మీరు కూడానా!
X
పక్క వాళ్ళ సినిమాలను లేదా ఆర్టిస్టులను పొగడటం మంచి సంప్రదాయం. ఇది అందరు ఆచరించాల్సిన విషయమే. ఇందులో తప్పు బట్టడానికి ఏమి లేదు. స్టార్ హీరోలు అన్నింటిని ప్రమోట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేకంగా ఎంచుకుని వాటి గురించి ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లోనో పోస్ట్ చేయడం సాధారణం. నవంబర్ 29న విడుదల కానున్న 2.0 మీద అక్కడి తారల కంటే మనవాళ్ళకే ఎక్కువ ఆసక్తి ఉంది. మహేష్ బాబు ఇటీవలే ట్రైలర్ ని మెచ్చుకుంటూ విష్ చేసిన సంగతి తెలిసిందే. అరవింద సమేత గురించి కానీ నిన్న లాంచ్ అయిన ఆర్ ఆర్ ఆర్ గురించి కానీ మాట మాత్రం చెప్పకపోవడం పట్ల ఇప్పటికే మెగా ప్లస్ నందమూరి ఫ్యాన్స్ కాస్త గుస్సాగా ఉన్న సంగతి విదితమే. పైగా యావరేజ్ గా ఆడుతున్న సర్కార్ ను పొగుడుతూ రెండు రోజుల క్రితం ట్వీట్ చేయడం ఇంకా హాట్ గానే ఉంది.

ఇప్పుడు నాగార్జున ఈ లీగ్ లోకి వచ్చాడు. తాజాగా 2.0 లో కీరవాణి పాడిన పాటను షేర్ చేస్తూ అద్భుతం అని వర్ణిస్తూ ఆపిల్ ఐట్యూన్ లింక్ ని షేర్ చేయడం ఇప్పుడు మరో కొత్త చర్చకు దారి తీస్తోంది. నిన్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ అంత గ్రాండ్ గా లాంచ్ అయ్యి అందులోనూ మెగాస్టార్ చిరంజీవి అతిధిగా విచ్చేసినప్పుడు తనకు మంచి స్నేహితుడు అన్న కారణంగా అయినా విష్ చేయాల్సింది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు మహేష్ తో పాటు నాగార్జున కూడా ఆర్ ఆర్ ఆర్ గురించి చెప్పకపోవడాన్ని హై లైట్ చేసుకున్నారు. అలా చెప్పాలని రూల్ లేదు కదా అని రివర్స్ ప్రశ్న రావొచ్చు. కానీ ఆర్ ఆర్ ఆర్ మాములు సినిమా కాదు. బయటికి చెప్పడం లేదు కానీ 2.0ను తలదన్నే బడ్జెట్ తో అంతకు మించిన హైప్ ని విడుదల సమయానికి తెచ్చుకోవడం ముమ్మాటికీ ఖాయం.

టాలీవుడ్ గర్వపడే మరో ప్రయత్నంగా ఇది నిలుస్తుందని ఇప్పటికే ఫీడ్ బ్యాక్ ఉంది. మరి అలాంటప్పుడు నాగార్జున ఓ మాట పెట్టేస్తే ఇంత చర్చా ఉండేది కాదు. కానీ ఇన్ సైడ్ టాక్ మరోలా ఉంది. క్రేజీ మల్టీ స్టారర్ కాబట్టి ఓపెనింగ్ కి ఆహ్వానం వస్తుందని పరిశ్రమలో చాలా మంది ఆశించారని కానీ క్రూతో పాటు ఇద్దరు హీరోల ఫ్యామిలీ తప్ప మీడియాతో సహా ఎవరిని పిలవకూడదని రాజమౌళి డిసైడ్ అయ్యాడు కాబట్టే ఇలా అయ్యిందని అంటున్నారు. నిజమిదని చెప్పలేం కానీ ఇలాంటి తెరవెనుక వ్యవహారాలు అంత ఈజీగా బయటపడవు.