Begin typing your search above and press return to search.
మైకుల్ని నాగ్ ఎందుకు తోసేశాడు
By: Tupaki Desk | 4 Nov 2015 3:59 AM GMTటాలీవుడ్ టాప్ హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవటానికి అస్సలు ఇష్టపడరు. సమస్యలకు కిలో మీటరు దూరంగా ఉండే మనస్తత్వం ఉన్న టాలీవుడ్ హీరోలను ఏదైనా వివాదం పక్కకొచ్చి పలుకరిస్తుంటే.. దాని వంక కూడా చూడకుండా తప్పుకోవటం మామూలే. కాకుంటే.. మరీ ఇంత ఇదిగానా? అనిపించేలా నవ మన్మదుడు నాగార్జున వ్యవహరించిన తీరు కాస్త విస్మయంగా మారింది.
మత అసహనం మీద బాలీవుడ్ బాద్షా దగ్గర నుంచి విలక్షణ నటుడు కమల్ హాసన్ వరకూ అందరూ తమ తమ అభిప్రాయాల్ని చెప్పేందుకు వెనుకాడకుంటే.. నాగార్జున మాత్రం మీడియా మైకుల్ని పక్కకు నెట్టేసి వెళ్లిపోయారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమానికి పాల్గొనటానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా మైకులన్నీ ఆయన ముందుకు చేరాయి.
తాను చెప్పాలనుకున్న అంశాన్ని చెబుతున్న సమయంలో.. మీడియా నుంచి మత అసహనానికి సంబంధించిన ఒక ప్రశ్న సంధించారు. అంతే.. ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. కొన్ని క్షణాలు ఆగిన నాగార్జున.. అప్పటివరకూ మాట్లాడుతున్న మైకుల్ని పక్కకు జరిపేసి తన దారిన తాను వెళ్లిపోయారు. మత అసహనంపై తాజాగా బాలీవుడ్ బాద్షా షారూక్ వ్యాఖ్యలు చేయటం.. దానిపై బీజేపీ.. వీహెచ్ పీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా నాగార్జున మాత్రం వివాదాస్పద అంశాల మీద తన మాట ఏమిటో చెప్పేందుకు ఏ మాత్రం సుముఖంగా లేనన్న విషయాన్ని తన తాజా చర్యతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.