Begin typing your search above and press return to search.

మాటల మాంత్రికుడినే మర్చిపోతే ఎలా?

By:  Tupaki Desk   |   5 Aug 2019 4:09 AM GMT
మాటల మాంత్రికుడినే మర్చిపోతే ఎలా?
X
నిన్న అట్టహాసంగా జరిగిన మన్మథుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున స్పీచ్ ఒకింత ఆశ్చర్యానికి ఒకింత షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. కారణం మన్మథుడు సినిమా గురించి ప్రస్తావిస్తూ దాని క్రెడిట్ మొత్తం డైలాగులతో సహా దర్శకుడు విజయ్ భాస్కర్ కు ఇవ్వడం అందరిని విస్మయం కలిగించింది. నిజానికి మన్మథుడు సక్సెస్ లో మేజర్ క్రెడిట్ సంభాషణల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దక్కుతుంది.

ఇప్పటికీ సాంకేతిక విషయాలపై పెద్దగా అవగాహన లేని నేటి తరం యువ ప్రేక్షకులు దాన్ని త్రివిక్రమ్ సినిమాగానే భావిస్తూ ఉంటారు. అంతగా వాటి ప్రభావం జనం మీద ఉంది. విజయభాస్కర్ దర్శకత్వం గురించి తక్కువ చేయడం కాదు కానీ త్రివిక్రమ్ అండగా ఉన్నంత వరకే ఆయన మర్చిపోలేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. జై చిరంజీవా తర్వాత ఈ ఇద్దరి కంపెనీ ఆగిపోయింది. డైరెక్టర్ గా ఆయన కనుమరుగయ్యారు. కాని త్రివిక్రం తన బ్రాండ్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకున్నారు

నాగ్ ఇంత కన్వీనియంట్ గా త్రివిక్రం పేరు మర్చిపోయి మన్మథుడి గురించి ప్రస్తావించడం పొరపాటా లేక మరొకటా అనేది అంతు చిక్కడం లేదు. గతంలో తనతో కానీ చైతు లేదా అఖిల్ తో కానీ త్రివిక్రమ్ సినిమా చేయించేలా నాగ్ విశ్వప్రయత్నాలు చేసినట్టుగా టాక్ వచ్చింది. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. అది మనసులో పెట్టుకుని నాగ్ ఇలా త్రివిక్రమ్ ను ప్రస్తావించలేదా లేక విజయ భాస్కరే డైలాగులు రాశారని పొరబడ్డారా ఆయనకే తెలుసు.

ఆ మధ్య మహర్షి వేడుకలో మహేష్ బాబు ఇలాగే పూరి జగన్నాధ్ పేరుని మర్చిపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రిన్స్ ట్విట్టర్ లో పొరపాటు ఒప్పుకునే దాకా వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో నాగ్ మన్మథుడు విషయంలో అలాంటిదే రిపీట్ చేయడం ఎక్కడికి దారి తీస్తుందో