Begin typing your search above and press return to search.
'మజిలీ' కింగ్ చూడలేదింకా
By: Tupaki Desk | 3 April 2019 11:51 AM GMTఅక్కినేని కాంపౌండ్ సినిమాలన్నీ కింగ్ నాగార్జున కనుసన్నల్లో నడవాల్సిందే. అన్ని దశల్లో కాకపోయినా ఫైనల్ ప్రొడక్ట్ టేబుల్ ముందుకు వచ్చేప్పుడైనా ఆయన చూస్తారు. తన సినిమాలతో పాటు.. నాగచైతన్య - అఖిల్ కానీ - సుమంత్ - సుశాంత్ ల సినిమాలకు నాగార్జున ఒపీనియన్ చెప్పనిదే ఫైనల్ ప్రొడక్ట్ రిలీజ్ కాదు. కింగ్ నాగార్జున రీషూట్లకు సజెషన్స్ ఇస్తుంటారు. అయితే ఈసారి ఏమైందో చై- సామ్ జంటగా నటించిన `మజిలీ` సినిమాని నాగార్జున చూడలేదట. ఆయన అందుబాటులో ఉన్నప్పటికి రీరికార్డింగ్ పూర్తవ్వకపోవడంతో తనకు చూపించలేదట. ఇదే విషయాన్ని నేడు హైదరాబాద్ లో జరిగిన ఇంటర్వ్యూలో నాగచైతన్య తెలిపారు.
చైతూ మాట్లాడుతూ.. నాన్న గారు ఇంకా సినిమా చూడలేదు. ముందే చూపిద్దాం అనుకున్నాం కానీ రీ రికార్డింగ్ ఆయన అందుబాటులో ఉన్నప్పటికి పూర్తి కాలేదు. ప్రేమకథా చిత్రాల్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా చూస్తే అంత ఆసక్తికరంగా అనిపించదు. అందువల్లే ఆయన చూడలేకపోయారు... అని తెలిపారు. చైతూ చెబుతున్న దానిని బట్టి మజిలీకి రీషూట్ల అవసరం పడలేదనే అర్థమవుతోంది. అంటే పూర్తిగా దర్శకుడు శివనిర్వాణకే వదిలేశారని భావించవచ్చు.
సినిమా కథాగమనం గురించి చెబుతూ.. మధ్య తరగతి సెంటిమెంట్స్ .. వారి జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా చాలా సహజంగా .. రియలిస్టిక్ గా ఉంటుంది. సినిమాలో సామ్ తప్ప నన్ను ఎవరు ఇష్టపడరు అని తెలిపారు. రిలీజ్ ముందు తిరుమలకి వెళ్లాలన్న ఆలోచన ఎవరిది? అని ప్రశ్నిస్తే.. సామ్ చెప్పింది వెళ్ళాను. నేను పెద్దగా దేనికి రియాక్ట్ కాను. చాలా న్యూట్రల్గా ఉంటానని తెలిపారు. డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. మజిలీ కోసం జర్నీలో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయామని అన్నారు. మూవీలో పోసానిగారితో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. నాకు ఈ సినిమాలో ప్రతి ఒక్కరితో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని వెల్లడించారు.