Begin typing your search above and press return to search.

సిసింద్రి కోసం కొత్త సితార!!

By:  Tupaki Desk   |   25 May 2017 5:31 AM GMT
సిసింద్రి కోసం కొత్త సితార!!
X
అఖిల్ అక్కినేని మొదటి సినిమా ఘోర పరాజయం తరువాత ఇప్పుడు అచి తూచి ఆలోచిస్తున్నాడు. 24 ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్ నడుస్తుంది. ఇప్పటికే విక్రమ్ కుమార్ నాగార్జున కుటంబం తో మంచి సఖ్యత ఉంది. అన్నపూర్ణ బేనర్ పై మనం సినిమాను విక్రమ్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి అఖిల్- విక్రమ్ కుమార్ సినిమాను అన్నపూర్ణ స్టూడియో బేనర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా మేక్ ఓవర్ అయ్యాడని తెలుస్తోంది.

కానీ ఇప్పటి వరకు అఖిల్ కు జోడీగా ఎవరు అనేది ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇదే విషయం నిర్మాత నాగార్జునను అడిగితే.. “మేము కూడా తొందరగా ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక నలుగురును పరిశీలిస్తున్నాము. కాకపోతే ఖచ్చితంగా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందిని మేము అనుకుంటున్నాము” అని చెప్పారు. ఇంతకు ముందు ధనుష్ - వాసుదేవ్ మినోన్ సినిమా ఎన్నై నోకి పాయుమ్ తోటా సినిమాలో హీరోయిన్ మేఘా ఆకాశ్ అనుకున్నారు కానీ అది ఎందుకో కుదరలేదు. అలాగే ఆలియా భట్ వంటి హీరోయిన్ ను కూడా అనుకున్నారు కాని సెట్టవ్వలేదు.

అసలు హీరోయిన్ కారణంగానే షూటింగ్ బ్రేక్ పడింది అని చెబుతుండగా.. ఇక నాగార్జున హీరోయిన్ ను ఫైనల్ చేసేవరకు దర్శకుడు విక్రమ్ ఫారిన్ వెళ్లాడట. తన భార్యతో కలసి ఒక బెటర్ హనీమూన్ ప్లాన్ చేసుకున్నాడని టాక్. మొత్తానికి అఖిల్ రెండో సినిమా మొదలయ్యాక కూడా ఇలా లేటవ్వడం అభిమానులను కాస్త కలవరపెడుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/