Begin typing your search above and press return to search.
అఖిల్.. నువ్వే కథ వెతుక్కో..
By: Tupaki Desk | 6 Dec 2017 5:41 PM GMTఆరు పదుల వయసు దగ్గర పడుతున్నా ఇంకా పాతికేళ్ల కొడుకు కెరీర్ ను ఓ దారిలో నడిపించడం కొంచెం కష్టమే అవుతుంది. అలాగే తప్పు కూడా అవుతుంది. పిల్లాడు తప్పటాడుగు వేస్తే సరిదిద్దాలి.. ఓ దారిని చూపించి పరిగెత్తమనలి.. తనకంటూ ఒక ఆలోచన వచ్చేలా తండ్రి చేయాలి. అప్పుడే వారికంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా అదే స్టైల్ లో ప్రవర్తిస్తున్నారు.
కొడుకుకి కోపం రాకుండా ఇక నాతో నడిచింది చాలు పరిగెత్తు అని స్వీట్ గా చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం చిన్న కొడుకు అఖిల్ కోసం నాగ్ ఎంతగా కష్టపడుతున్నాడో అందరికి తెలిసిందే. నాగ్ కెరీర్ లో సెట్ అవ్వడానికి నాగేశ్వరరావు గారు మొదట పట్టించుకున్నంతగా తర్వాత పట్టించుకోలేదు. నాగ్ కూడా మొదట అపజయాలతో అడుగుపెట్టినవారే. కానీ తన సొంత నిర్ణయంతో శివ సినిమాను ఒకే చేసి హిట్టు కొట్టాడు. ఇక అసలు విషయానికి వస్తే.. హలో సినిమా తర్వాత నాగ్ అఖిల్ కోసం నెక్స్ట్ ఏలాంటి కథను ఒకే చేస్తారు అని అడిగితే..అలాంటిది ఏమి లేదు. నెక్స్ట్ తన కథలను తనే నిర్ణయించుకోవాలి.. అనేశారు.
''నేను ప్రతి సారి వెలుపట్టి నడిపించలేను. నేను ప్రొడక్షన్ ని చూసుకోవాలి. సినిమాలు చేయాలి. చాలా పనులు ఉన్నాయి. అఖిల్ నువ్వే కథలను వెతుక్కో అని నిన్నే చెప్పాను. అంతే కాకుండా తను కథలను ఎంచుకునే స్థాయికి రావాలి. ఒకవేళ నా వరకు ఏదైనా కథ వస్తే తప్పకుండా చెప్తాను'' అని నాగ్ నవ్వుతో సమాధానం ఇచ్చారు. మరి అఖిల్ కూడా కొంచెం నాన్నలా కాకపోయినా తనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా ప్రయోగాత్మకమైన కథలను ఎంచుకుంటే సక్సెస్ కాకపోయినా నటనలో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత నటనను దృష్టిలో పెట్టుకొని పెద్ద దర్శకులతో పని చేసే అవకాశం ఉంటుంది. మరి అఖిల్ ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి.