Begin typing your search above and press return to search.
ఆఫీసర్ అయ్యాక బంగార్రాజు!!
By: Tupaki Desk | 14 March 2018 8:37 AM GMT2016లో సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా దర్శకుడికి కూడా ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. మొదటి సినిమానే అయినా కూడా కళ్యాణ్ కృష్ణ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చినట్టు తెరకెక్కించాడు. సినిమాలో కనిపించిన నటీనటుల కెరీర్ కి కూడా బంగార్రాజు బూస్ట్ ఇచ్చాడు.
సినిమాలో నాగ్ చేసిన బంగార్రాజు పాత్ర అందరికి బాగా నచ్చేసింది. అయితే ఆ పాత్ర కోసం కథను రాయాలని దర్శకుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. నాగార్జున కూడా అందుకు సానుకూలంగా స్పందించాడు. అయితే కళ్యాణ్ చెప్పిన కథలో నాగ్ పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేయాలనీ డిసైడ్ అయ్యారు. అయితే ప్రస్తుతం నాగ్ వర్మ ఆఫీసర్ తో బిజీగా ఉన్నాడు.
మరోవైపు దర్శకుడు కూడా రవితేజ నేల టికెట్ తో బిజీగా ఉన్నాడు. ఇద్దరి సినిమాల పనులు కొంచెం చివరి దశలో ఉన్నాయి. ఆ రెండు సినిమాల షూటింగ్స్ ఎండ్ అయితే వెంటనే ప్రాజెక్ట్ గురించి ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నారట. దర్శకుడు కూడా కథలో మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడట. మరి బంగార్రాజు క్యారెక్టర్ సెకండ్ టైమ్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.