Begin typing your search above and press return to search.
నా బెడ్డు బాత్రూం వేరొకరికి నో ఛాన్స్!
By: Tupaki Desk | 7 Aug 2019 1:27 PM GMTకింగ్ నాగార్జున నటించిన `మన్మధుడు- 2` ఆగస్టు 9న రిలీజవుతోంది. విడుదల ముందు ప్రమోషన్స్ లో నాగ్ చేస్తున్న హంగామా తెలిసిందే. ఓవైపు `మన్మధుడు 2 `ప్రమోషన్స్ చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై `బిగ్ బాస్ 3` హోస్టింగ్ తో అదరగొడుతున్నారు. బిగ్ బాస్ హోస్టింగ్ ఎంతో జాలీగా గడిచిపోతోందని నాగార్జున చెబుతున్నారు. అక్కడ మన్మధుడు 2 ని ప్రమోట్ చేస్కుంటున్నారు. అంతేకాదు.. ఈ షో గురించి కాస్తంత డీప్ గానే ముచ్చటించారు ఓ ఇంటర్వ్యూలో.
బుల్లితెరపై రెండోసారి ఓ డిఫరెంట్ షోకి హోస్టింగ్ చేస్తున్న నాగార్జున తనను గొప్ప టీఆర్ఫీతో జనం ఘనంగా స్వాగతించారని ఆనందం వ్యక్తం చేశారు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ (సీజన్3) 15.07 రేటింగ్ తో నంబర్ వన్ స్థానంలో నిలిచిందంటే తనని హోస్ట్ గా అంగీకరించారనే దానర్థం అని కింగ్ చెప్పారు. బిగ్ బాస్ అనుభవం చాలా డిఫరెంటుగా ఉందని.. హౌస్ లో అందరితో జోకులేస్తూ సరదాగా సాగిపోతోందని అన్నారు.
అంతేకాదు మీలో ఎవరు కోటీశ్వరుడు (ఎంఈకే)తో పోలిస్తే కాస్తంత జడ్జిమెంట్ పరంగా కాంప్లికేటెడ్ గానూ ఉందని అన్నారు. హౌస్ లో వ్యక్తులు ఈ వారం ఒకలా వచ్చే వారం ఇంకోలా మారిపోతున్నారు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండడం లేదు. 15 మందిలో ఎవరు ఏమిటో అంచనా వేయలేకపోతున్నాం. అందుకే నాకు ఈ షో నచ్చదు! అని అన్నాను.. అంటూ జోక్ గా నవ్వేశారు. ఒకే బెడ్డు బాత్రూమ్ నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేను. ఒక్క నా భార్యతో తప్ప!! అంటూ కాస్తంత హార్డ్ హిట్టింగ్ స్టైల్ లో చెప్పారు మన్మధుడు. బిగ్ బాస్ షోకి అన్ని వర్గాల జనం నుంచి స్పందన బావుందని తెలిపారు.