Begin typing your search above and press return to search.
నెగెటివిటీని చంపేసేందుకు నాగ్ ప్లాన్
By: Tupaki Desk | 1 Dec 2017 7:21 AM GMT‘హలో’ టీజర్ గురించి వచ్చిన పాజిటివ్ టాక్ అంతా.. బ్యాగ్రౌండ్ స్కోర్ కాపీ వివాదంతో కొట్టుకుపోయింది. కాపీ రైట్ వివాదం కారణంగా ఈ టీజర్ ను యూట్యూబ్ నుంచి తీసేయడం సంచలనం సృష్టించింది. ఆ రోజంతా సోషల్ మీడియాలో ‘హలో’ గురించి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ నడిచింది. తాము ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన సంస్థతో ఒప్పందం చేసుకుని.. అధికారికంగానే ఆ స్కోర్ తీసుకున్నామని అఖిల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. రైట్స్ తీసుకుని ఉన్నప్పటికీ ఇది అనూప్ ఒరిజినల్ స్కోర్ కాదు అనే విషయం మీద చర్చ జరిగింది. మొత్తానికి ‘హలో’ మీద ఈ ఇష్యూ నెగెటివ్ ఎఫెక్ట్ చూపించింది.
ఐతే ఈ చర్చల్లోంచి జనాల్ని మళ్లించేందుకు ‘హలో’ నిర్మాత అక్కినేని నాగార్జున హడావుడి పడుతున్నట్లు తెలుస్తోంది. వర్మ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగించేసిన నాగ్.. ఆడియో విడుదల రోజుకు షెడ్యూల్ చేసి పెట్టిన ట్రైలర్ ను ముందే లాంచ్ చేయించాలని డిసైడయ్యాడు. ఈ విషయమై సడెన్ గా ప్రకటన కూడా చేయించాడు. శుక్రవారమే ‘హలో’ ట్రైలర్ వచేస్తోంది. ఈ ట్రైలర్ చూశాక జనాల దృష్టి మారుతుందని నాగ్ భావిస్తున్నాడట. టీజర్ కంటే ట్రైలర్ మరింత బాగుంటుందని.. కొన్ని రోజులు జనాలు దాని గురించి చర్చించుకున్నాక.. ఆడియో వేడుక చేద్దామని.. ఆపై మిగతా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా చేద్దామని.. డిసెంబరు 22న సినిమా వచ్చే వరకు ‘హలో’ను వార్తల్లోనే ఉంచుదామని నాగ్ భావిస్తున్నాడట. ఇంతకీ ‘హలో’ ట్రైలర్ ఎలా ఉంటుందో చూద్దాం.