Begin typing your search above and press return to search.

సీనియర్ హీరో రిస్క్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   5 March 2020 4:30 AM GMT
సీనియర్ హీరో రిస్క్ చేస్తున్నాడా?
X
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున నెక్స్ట్ సినిమా విషయంలో పెద్ద రిస్క్ చేస్తున్నాడు. అవును తనకి కలిసి రాని ఓ క్రైం యాక్షన్ డ్రామా కథతో 'వైల్డ్ డాగ్' అనే సినిమా చేస్తూ ఫ్యాన్స్ లో భయం పుట్టిస్తున్నాడు. ప్రస్తుతం నాగ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. సోగ్గాడే చిన్ని నాయనతో మళ్ళీ ఊపందుకుంది అనే లోపే 'ఓం నమో వేంకటేశాయ'.దేవదాస్' - 'ఆఫీసర్' - 'మన్మథుడు 2' లాంటి డిజాస్టర్స్ లిస్టులోకి చేరాయి.

మన్మథుడు 2 అయితే ఎవరూ ఊహించని విధంగా ఘోరమైన అపజయం అందుకుంది. దీంతో కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న నాగ్ ఓ స్ట్రాంగ్ సినిమాతో వస్తాడనుకుంటే మళ్ళీ ఆఫీసర్ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అసలే టైటిల్ క్లిక్ అవ్వలేదు. స్టిల్స్ చూస్తుంటే ఆఫీసర్ గుర్తొస్తుంది. సినిమాకు ఉన్న ఒకే ఒక్క హాప్ అంటే అది దర్శకుడే. మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న రచయిత , పైగా హిట్ సినిమాలకు పనిచేసాడు కాబట్టి నాగ్ చేత హిట్ కొట్టిస్తాడనే కొద్దిపాటి నమ్మకం ఉంది.

మరి కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో ఈ కాప్ డ్రామా సినిమాలు గట్రా అవసరమా నాగ్ కి తెలియాలి. ఈ సినిమా తర్వాత 'బంగార్రాజు' ను సెట్స్ పైకి తీసుకురానున్నాడు నాగ్. కనీసం ఆ సినిమా అయినా మళ్ళీ నాగ్ కి పూర్వ వైభవం తెస్తుందేమో చూడాలి.