Begin typing your search above and press return to search.
మహానటి సాక్షిగా నాగ్ కౌంటర్
By: Tupaki Desk | 1 May 2018 6:16 PM GMTఇప్పుడు టాలీవుడ్ ని క్యాస్టింగ్ కౌచ్ అంశం కుదిపేస్తోంది. ఈ ఎపిసోడ్ ఎన్నెన్నో మలుపులు తిరుగుతోంది. ఇప్పుడప్పుడే బ్రేక్ పడేటట్లు కూడా కనిపించడం లేదు. టాలీవుడ్ కి సంబంధించి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ అంశంపై మాట్లాడుతున్నారు. కానీ స్టార్ హీరోలు ఎవరూ ఈ టాపిక్ పై రియాక్ట్ కాలేదు.
కానీ మహానటి మూవీ ఆడియో ఫంక్షన్ లో మాత్రం అక్కినేని నాగార్జున.. శ్రీరెడ్డి ఇష్యూను ఇన్ డైరెక్టుగా స్పృశించారు. శ్రీరెడ్డి పేరును కానీ.. క్యాస్టింగ్ కౌచ్ అన్న పదం కానీ.. మీడియా వివాదం కానీ ఆయన మాటల్లో వినిపించలేదు. ఇలాంటివి మాట్లాడితే.. సినిమా గురించి కంటే.. ఆ పైపై మాటలే హైలైట్ అవుతున్నాయి. సినిమా ప్రచారం పక్కకెళ్లిపోతోంది. అందుకే నాగార్జున చాలా హుందాగా ఈ ఇష్యూపై స్పందించారు. ఓ లెజెండరీ యాక్టర్ పై.. ముఖ్యంగా ఓ మహిళపై.. మహనీయురాలిపై బయోపిక్ ను తీయడం తెలుగు సినిమాకే గర్వకారణం అన్నారు నాగార్జున. ఈ సినిమాకు మహిళలతో ఉన్న లింకులను బైటపెట్టి మరింత ఆసక్తి కలిగించారాయన.
"ఆ సినిమాకు నిర్మాతలు స్వప్న.. ప్రియాంకదత్. అశ్వినీదత్ కాదు.ఈ సినిమాలో 20 మంది మహిళలు టెక్నీషియన్స్ గా వర్క్ చేశారు. ఇది నిజంగా అద్భుతం. అంతేకాదు.. ఇంత భారీ సెట్ నిర్మాణం చేసినది కూడా ఆడపిల్లలే అని తెలిసింది. మన తెలుగు ఇండస్ట్రీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. టైం మారుతోంది. థింగ్స్ మూవింగ్.. మనం కూడా మారాల్సి ఉంది" అని చెప్పిన నాగార్జున.. తన కోడలు పిల్ల సమంతను.. మహానటిగా యాక్ట్ చేసిన కీర్తి సురేష్ ను కూడా ప్రశంసించారు.