Begin typing your search above and press return to search.

మీటూపై సైలెంటుగా క్లాస్ తీస్కున్నారా?

By:  Tupaki Desk   |   29 Sep 2019 3:20 PM GMT
మీటూపై సైలెంటుగా క్లాస్ తీస్కున్నారా?
X
అవునా.. ఇది నిజ‌మా? అంటే.. నిజ‌మే. మీటూ ఉద్య‌మంపై త‌న‌కు తెలీకుండానే కింగ్ నాగార్జున అదిరిపోయే పంచ్ వేశారు. బిగ్ బాస్ శ‌నివారం సాయంత్రం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి క్లాస్ తీస్కుంటూ ఆయ‌న అన్న ఓ మాట‌ను అన్వ‌యిస్తే అందులో ఈ అర్థం ధ్వ‌నించింది.

ఎప్పుడో జ‌రిగిన పాత విష‌యాల్ని ఇప్పుడు గుర్తు చేసుకుని ఎందుకంత రాద్ధాంతం అంటూ నాగ్ హౌస్ లో ఒక‌రికి క్లాస్ తీస్కున్నారు. ఒక అవ‌కాశ వాదిలా టైమ్ చూసి అలా చేయ‌డం బాలేద‌ని క్లాస్ తీస్కున్నారు నాగ్. అయితే ఇటీవ‌ల మీటూ ఉద్య‌మంలో చాలా స‌న్నివేశాలు ఇలాంటివే. అపుడెపుడో ప‌ది సంవ‌త్సరాల క్రితం జ‌రిగిన‌వి.. అవ‌కాశ వాదిలా ఇప్పుడు టైమ్ చూసి మీటూ వేదిక‌గా క‌క్ష తీర్చుకుంటున్నారు కొంద‌రు. దీనిపైనే హోస్ట్ నాగార్జున‌ పంచ్ వేశారా.. అది త‌న‌కే తెలియ‌కుండా ఫ్లోలో వ‌చ్చేసిందా? అన్న‌ది త‌నే చెప్పాల్సి ఉంటుంది.

ఇక బిగ్ బాస్ సీజ‌న్ 3 ప్రారంభం కాక‌ముందు మీటూ సెగ స్టార్ మా వాళ్ల‌కు గ‌ట్టిగానే త‌గిలింది. ఆ రాద్ధాంతం వ‌ల్ల బిగ్ బాస్ కొత్త సీజ‌న్ కి బాగానే ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. ఇక మీటూ వేదిక‌గా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఒక్క‌రికి కూడా ఇప్ప‌టివ‌ర‌కూ శిక్ష ప‌డింది లేదు. దీంతో వాళ్లంతా నిర‌ప‌రాధులుగానే బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌రి ఆ యాంగిల్ లో కూడా ఆ పంచ్ క‌నెక్ట‌యిన‌ట్టే. ఏమంటారు నాగ్ స‌ర్?