Begin typing your search above and press return to search.
సమంతకు నాగ్ సాయం చేస్తాడా?
By: Tupaki Desk | 20 Aug 2018 5:37 PM GMTఅక్కినేని సమంత లీడ్ రోల్ ప్లే చేసిన `యూటర్న్`చిత్రం సెప్టెంబర్ 13 విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కన్నడలో ఘన విజయం సాధించిన యూటర్న్ ను అదే పేరుతో తెలుగులోకి దర్శకుడు పవన్ కుమార్ రీమేక్ చేశారు. అయితే, ఈ థ్రిల్లర్ జానర్ మూవీకి కొత్త చిక్కు వచ్చి పడింది. ఇది ఓ వర్గం ప్రేక్షకులనే టార్గెట్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమా బిజినెస్ పూర్తి కాలేదని తెలుస్తోంది. అందులోనూ, సమంత మినహా చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ కూడా లేదు. దీంతో, ఈ చిత్రం రిజల్డ్ ఎలా ఉంటుందో అని కొనడానికి సందేహిస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మార్కెట్ చేయడానికి సమంత మామ నాగ్ రంగంలోకి దిగక తప్పదని టాక్.
తన మేనల్లుడు సుశాంత్ సినిమా చిలసౌ - మేనకోడలు సినిమా గూఢచారి ప్రమోషన్లలో నాగ్ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. చిలసౌను నాగ్ కొనాల్సి కూడా వచ్చింది. ఇక దాదాపుగా యూటర్న్ కు కూడా నాగ్ ఆపన్న హస్తం అందించాల్సిందేనని టాక్. ఈ సినిమా నిర్మాణానికి పబ్లిసిటీతో కలిపి 10 కోట్ల వరకు ఖర్చు అయిందట. ఆంధ్ర ఏరియాను 5కోట్లు రేషియోలో కోట్ చేస్తున్నారట. అయితే, పర్టిక్యులర్ జానర్ కావడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని ట్రేడ్ టాక్. మరి, ఇటువంటి సమయంలో నాగ్ రంగంలోకి దిగి వైజాగ్ - కృష్ణాజిల్లాల వరకు పార్టనర్ గా చేరతారా? లేదంటే మేనల్లుడిలాగే కోడలి కోసం సినిమాను కొంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.