Begin typing your search above and press return to search.

పాత నాగ్ మళ్ళీ కనిపిస్తున్నారే!

By:  Tupaki Desk   |   29 Dec 2019 9:29 AM GMT
పాత నాగ్ మళ్ళీ కనిపిస్తున్నారే!
X
సీనియర్ స్టార్ నాగార్జున ఈమధ్య ఫ్లాపులతో సతమతమవుతున్నారు కానీ ఆయన ఎప్పుడూ ట్రెండ్ ను అందిపుచ్చుకోవడంలో ముందే ఉంటారు. టాలీవుడ్ హీరోలలో ఆయన చేసినన్ని ప్రయోగాలు చాలా తక్కువమంది చేసి ఉంటారు. ఇక కొత్త దర్శకులను పరిచయం చేయడం.. యువ దర్శకులతో పని చేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటే. ఈమధ్య ఫ్లాపుల ఎఫెక్ట్ తో నాగ్ మరోసారి తనకు అలవాటైన మార్గం ఎంచుకున్నట్టుగా అనిపిస్తోంది.

ఈమధ్యే నాగార్జున కొత్త సినిమా 'వైల్డ్ డాగ్' ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నూతన దర్శకుడు అహిషోర్ సాలమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రయోగాత్మకంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. రొటీన్ కమర్షియల్ మసాలా కాకుండా సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగ్ నేరస్తుల పట్ల.. తీవ్రవాదుల్ల పట్ల కఠినంగా వ్యవహరించే పోలీస్ ఆఫీస్ పాత్రలో నటిస్తున్నారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మీడియాలో ఆయనకు 'వైల్డ్ డాగ్' అనే నిక్ నేమ్ ఉంటుంది.

ఈ సినిమాలో కొన్ని రియలిస్టిక్ స్టంట్స్ లో నటించాల్సి వచ్చిందని సమాచారం. అరవై ఏళ్ళ వయసులో కూడా నాగ్ ఎంతో ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తారు కాబట్టి ఈ ఛాలెంజింగ్ పాత్రకు సరే అన్నారట. ప్రస్తుతం క్రూర నేరస్తులను.. తీవ్రవాదులను సంక్రాంతి అల్లుళ్ళుగా ట్రీట్ చేసే పరిస్థితి ఉందనేది చేదు వాస్తవం. సరిగ్గా నాగ్ ఇలాంటివారిని పిట్టలను కాల్చినట్టు కాల్చి పారేస్తారని.. దీనిపై మీడియా.. మానవ హక్కుల మేథావులు.. ఇతర ఉదార స్వభావులు ఎలా స్పందిస్తారనేది ఆయన పట్టించుకోరట. నేరస్తులకు శిక్ష పడిందా లేదా అనేది పట్టించుకోవడం మాత్రం ఆయన క్యారెక్టర్ అని సమాచారం. చూస్తుంటే ఈ సినిమాతో నాగ్ సంచలనం సృష్టించేలా ఉన్నారే!