Begin typing your search above and press return to search.
నాగ్ రోజు మొదలయ్యేది ఆ పాటతోనే
By: Tupaki Desk | 20 Sep 2016 6:37 PM GMTఅక్కినేని నాగార్జున తన సిని కెరీర్ లో ఎన్ని సాంగ్స్ చేసుంటారు.. ఎన్ని సాంగ్స్ విని ఉంటారు.. అందులో ఎన్ని ఆయనకు విపరీతంగా నచ్చేసుంటాయో చెప్పడమంటే కష్టమే కానీ.. రీసెంట్ గా మాత్రం ఆయన ఓ పాటకు అడిక్ట్ అయిపోయారట. పొద్దు పొద్దున్నే ఆ పాట వినకపోతే రోజు మొదలయినట్లుగా అనిపించడం లేదని చెబుతున్నారు నాగ్.
నాగార్జునకు ఇంతగా నచ్చేసిన ఆ పాట.. ఆయన కుమారుడు నటించిన ప్రేమమ్ మూవీలోదే కావడం విశేషం. ప్రేమమ్ ఆడియో ఫంక్షన్ కు నవ మన్మథుడి రేంజ్ లో హాజరైన నాగ్.. 'ఎవరే' అంటూ సాగే పాటపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "ఎవరే పాట వినమంటూ చైతన్య నాకు సీడీ ఇచ్చాడు. అప్పటి నుంచి దీనికి అడిక్ట్ అయిపోయా. ప్రతీ రోజూ ఉదయాన్నే ఆ పాట ఒకసారి విన్నాకే రోజును ప్రారంభిస్తున్నా' అని చెప్పారు నాగ్.
మలరే అంటూ మలయాళీ ప్రేమమ్ లో కూడా ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. రాజేష్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ ను తెలుగులో కూడా ఉపయోగించారు. మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్.. లిరికల్ గా.. ట్యూన్ పరంగా సూపర్బ్ గా ఉంటుంది. విజువల్ పరంగా కూడా ఆకట్టుకుంటుందని సాంగ్ ప్రోమోలో తేలిపోయింది కాబట్టి.. ఈ ఏడాది బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచే ఛాన్స్ 'ఎవరే'కి ఉంది.