Begin typing your search above and press return to search.

సెకండాఫ్ అంతా నాగార్జున ఉంటాడు

By:  Tupaki Desk   |   7 Sep 2016 9:30 AM GMT
సెకండాఫ్ అంతా నాగార్జున ఉంటాడు
X
ఇప్పుడు పెద్ద హీరోలు అతిథి పాత్రలు చేయడం.. క్యారెక్టర్ రోల్స్ చేయడం కామనైపోయింది కానీ.. అక్కినేని నాగార్జున ఎప్పట్నుంచో ఈ పని చేస్తున్నారు. తాజాగా ఆయన ‘నిర్మలా కాన్వెంట్’ అనే టీనేజ్ లవ్ స్టోరీలో కూడా ఓ కీలకపాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తన నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి దానికి ఆకర్షణ తేవడానికి ఊరికే అలా తళుక్కున మెరిసి మాయమైపోతాడేమో అనుకుంటున్నారు చాలామంది. ఐతే తనది అలాంటి చిన్న పాత్ర కాదని.. కథలో చాలా కీలకం అని చెప్పాడు నాగార్జున. సినిమాలో ద్వితీయార్ధం అంతటా తన సినిమా ఉంటుందని నాగ్ వెల్లడించాడు.

‘‘తెలుగులో ఇలాంటి సినిమాలు వచ్చి చాలా కాలమైంది. ప్రేమ దేన్నయినా జయిస్తుందనే సందేశంతో ఈ చిత్రం తెరకెక్కింది. సెకండాఫ్ అంతా నా పాత్ర ఉంటుంది. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఇలాంటి పాత్రలు చేశాను కాబట్టే నాకు స్టార్ డమ్ వచ్చింది. రోషన్-శ్రియ శర్మ జంట చూడముచ్చటగా ఉంది. రోషన్ నటన చూస్తే అతడికిది తొలి సినిమా అనిపించదు. హీరోగా నా తొలి రోజుల్లో నా గొంతు బాగోలేదనేవారు. ఐతే ఈ చిత్ర సంగీత దర్శకుడు రోషన్ నా గొంతు బాగుంటుందని.. పాట పాడితే ఇంకా బాగుంటుంందని పట్టుబట్టి పాడించాడు. హ్యాపీగా పాడేశాను. ఈ నెల 16న ‘నిర్మలా కాన్వెంట్’ను రిలీజ్ చేస్తున్నాం’’ అని నాగ్ వెల్లడించాడు. ఇక తన బ్లాక్ బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుందని చెప్పిన నాగ్.. ఫస్ట్ పార్ట్ లో లాగే అందులోనూ ఎంటర్టైన్మెంట్ డోస్ బాగా ఉంటుందని అన్నాడు.